కరీంనగర్ టౌన్, వెలుగు: లూయీస్బ్రెయిలీని ఆదర్శంగా తీసుకుని అద్భుత విజయాలు సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. స్థానిక విద్యానగర్‌లోని అంధుల స్కూల్ లో గురువారం లూయీస్ బ్రెయిలీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్పాల్గొని మాట్లాడారు.
కార్యక్రమంలో డీడబ్ల్యూవో సరస్వతి, అంధుల స్కూల్ ప్రిన్సిపాల్ నర్మద, బధిరుల స్కూల్ ప్రిన్సిపాల్ నాగలక్ష్మి పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌లో ఆపరేషన్స్మైల్పై రివ్యూ మీటింగ్నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను కూలీ పనులకు పంపించొద్దన్నారు. తప్పిపోయిన పిల్లల కోసం ఏటా జనవరిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్ యాస్మిన్ బాషా ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, పలువురు సంఘ నాయకులు, అంధులు, పోషకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.