Women Special : ప్రేమ, బ్రేకప్ అంతా ఈ హార్మోన్ల వల్లనే...

ప్రేమికులుగా విడిపోయినా అర్థం చేసుకోవడానికి గొప్ప మనసుండాలి. కానీ ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలంటే ముఖ్యంగా ఆక్సిటోసిన్ హార్మోన్ ఉండాలి. ఎందుకంటే ప్రేమను పుట్టించే హార్మోన్ అదే. ఈ హార్మోన్ వల్లే ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. కేవలం ప్రేమకు మాత్రమే కాదు. రకరకాల ఎమోషన్స్ కు కారణం హార్మోన్ లే. ఆనందాన్ని పెంచే హ్యాపీ హార్మోన్లు ఏంటో, వాటి లెవల్స్ బాగుండాలంటే ఏమి చేయాలో ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

బాడీలో హార్మోన్లు వివిధ గ్లాండ్స్ (గ్రంథులు) నుంచి ప్రొడ్యూస్ అవు తాయి. అవే మనసును, బాడీని కంట్రోల్ చేస్తాయి. కొన్ని హార్మోన్లు పాజిటివిటీని ప్రమోట్ చేస్తాయి. అవే మనిషికి అవసరం కూడా. నవ్వుతెప్పించేవి. ఒత్తిడిని జయించేవి, ప్రశాంతంగా ఉండేవి. వాటిలో డోపమైన్, సెరటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ ప్రధాన మైనవి. ఇవే  హ్యాపీ హార్మోన్లు.

ప్రేమ పుట్టాలంటే...

ఆక్సిటోసిన్.. దీన్నే లవ్ హార్మోన్ అంటారు. ఇద్దరి మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరగా లంటే ఈ హార్మోన్ లెవల్స్ బాగుండాలి. బిడ్డకు తల్లి పాలు పట్టించడానికి, వాళ్ల మధ్య సంబంధం బలపడటానికి ఈ హార్మోన్ చాలా బాగా పని చేస్తుంది. అలాగే ఇద్దరి మధ్య నమ్మకం, ప్రేమ, రిలేషన్ షిప్ బాండింగ్ను ఈ హార్మోన్ పెంచుతుంది.

మెమరీ పవర్ పెరగాలంటే..

సెరలోనిన్.. ఈ హార్మోన్ మూడు రెగ్యులేట్ చేస్తుంది. సరిగ్గా నిద్రపట్టడం, ఆకలి, డైజెషన్ ను కంట్రోల్ చేస్తుంది. మెమరీ పవర్ను, నేర్చుకునే ఆసక్తిని పెంచుతుంది. ఈ సెరటోనిన్ హార్మోన్ లెవల్స్ పెరగాలంటే.. సూర్యరశ్మి ఎంతో ఉపయోగపడుతుంది. 10-15 నిమిషాలు మార్నింగ్ టైంలో సన్లైట్ ఉండాలి. అలాగే రోజూ కొత్త ప్రదేశాలకు వెళ్లడం ద్వారా, రెగ్యులర్ ఎక్సర్ సైజ్ వల్ల ఈ హార్మోన్ లెవల్స్ పెరుగుతాయి.

మంచి ఆలోచనల కోసం

డోపమైన్..... ఫీల్ గుడ్ హార్మోన్. ఇది కెమికల్ మెసెంజర్లా పనిచేస్తుంది. నరాలకు, కణాలకు మధ్య సందేశాలని మోసుకెళ్లి వ్యక్తి మూడు డిసైడ్ చేస్తుంది. పనుల మీద ఫోకస్, ప్లానింగ్, ఇంట్రెస్ట్ ను పెంచుతుంది. యునిక్ ఐడియాస్ రావడంలో డోపమైన్ బాగా పని చేస్తుంది.

ప్రశాంతత కోసం..

ఎండార్ఫిన్.. ఈ హార్మోన్ నేచురల్ పెయిన్ రిలీవర్. అంటే మానసిక ఒత్తిడిని తగ్గించి, అలసట ను, చికాకును కంట్రోల్ చేస్తుంది. ఎండార్ఫిన్ మనిషి శరీరంలో మూడ్ బూస్టర్ పనిచేస్తుంది. 

ఇలా చేస్తే..

* ఈ హ్యాపీ హార్మోన్ల లెవల్స్ పెరిగి, ఎప్పుడూ హ్యాపీగా ఉండాలంటే డైలీ రొటీన్లో పలు యాక్టివిటీలను యాడ్ చేయాలి. రెగ్యులర్ ఎక్సర్ సైజ్ హెల్త్ ను పెంచినట్టే దోషమైన్, ఎండార్ఫిన్ హార్మోన్లను పెంచుతుంది.
* ఫ్రెండ్స్ తో కలిసి నవ్వుతూ, తుళ్లుతూ, మాట్లాడుకోవడం, ఫన్నీ వీడియోలను షేర్ చేసుకోవడం వల్ల ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతాయి. దీని ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. 
* ఒకరితోక్లోజ్ ఉండటం, నమ్మకాన్ని పెంచే పనులు చేయడం, కేరింగ్ గా ఉండటం వంటి పనులు ఆక్సిటోసిన్ ను పెంచుతాయి. 
* ఇష్టమైన వారితో కలిసి భోజనం చేయడం ద్వారా డోపమైన్ లెవల్స్ పెరుగుతాయి. స్పైసీ ఫుడ్, యోగర్ట్, బీన్స్, ఎగ్స్, ఆల్మండ్స్ వంటివి ఎండార్ఫిన్ ను పెంచుతాయి. 
* అలాగే డాన్సింగ్, సింగింగ్, డ్రమ్స్ వాయించడం కూడా ఈ హార్మోనున్ను పెంచుతాయి.
* ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వినడం వల్ల కూడా డోపమైన్ హార్మోన్ రిలీజ్ అయి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
* పెట్ ను పెంచుకోవడం కూడా శరీరంలో హార్మోన్ల ప్రొడ్యూస్ కు కారణం అవుతుంది. 
* కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువుల మీద ఎఫెక్షన్ ఉంటే అది ఆక్సిటోసిన్ ను బూస్ట్ చేస్తుంది.
 

ALSO READ :- నా కొడుకునే అరెస్ట్ చేస్తారా: పోలీస్స్టేషన్లో పోలీసులపై కాల్పులు