ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి, ప్రియుడి పరిస్థితి విషమం

పెద్దలు తమ పెళ్లికి  ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది.  ఈ ఘటన  మహబూబాబాద్  జిల్లాలో చోటుచేసుకుంది. ఇందులో  ప్రియురాలు మృతి చెందగా..  ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది.  మహబూబాబాద్ - జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన రవీందర్, కొట్టెం రవళి ఇద్దరు ప్రేమించుకున్నారు.  ఇంట్లో చెప్పకుండాశ్రీకాకుళం జిల్లాకు వెళ్లిపోయి కాపురం పెట్టారు. 

రవళికి మూడేళ్ల క్రితం వేరే యువకుడితో పెళ్లి కాగా భర్తను వదిలేసి తల్లితండ్రుల వద్దే ఉంటుంది. ఈ క్రమంలో రవళికి,  రవీందర్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దీంతో వీరు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు.  ఈ క్రమంలో వీరిద్దరి తల్లిదండ్రులు ఎవరికి వారే పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో పోలీసులు ఈ ప్రేమ జంటను పట్టుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరింటికి వారిని పంపించారు. 

మూడు రోజుల క్రితం రవీందర్ ఇంటికి రవళి రావడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. దీంతో రవళి భయపడి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా, అది చూసిన రవీందర్ కత్తితో గొంతు కోసుకున్నాడు. రవీందర్ పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.