ఒక వ్యక్తిని చాలా మంది ప్రేమిస్తారు. కానీ.. ఆ వ్యక్తి మాత్రం ఒకరినే ప్రేమిస్తారు. కొంతమంది ధైర్యం లేక తమ ప్రేమను చెప్పలేకపోతారు. కొంతమంది నిజాయితీగా ప్రేమించి.. ప్రేమని వ్యక్తీకరించినా.. ఎదుటి వ్యక్తి అపార్థం చేసుకుంటారు. ఇలా కొన్ని ప్రేమలు‘వన్ సైడ్'గా మిగిలిపోతాయి. అలా మిగిలిపోకూడదంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
ఇష్టపడ్డవాళ్లకు.. ప్రేమని తెలపాలంటే చాలా ధైర్యం కావాలి. వాళ్లతో మాట్లాడాలన్నా.. కలిసి నడవాల న్నా కూడా. ఆ వ్యక్తికి దగ్గరయ్యే క్రమంలో కొంచెం తేడా వచ్చినా తర్వాత పరిణామాలు భయంకరంగా ఉంటాయి.ఆ స్నేహాన్ని శాశ్వతంగా కోల్పోవచ్చు. నిజాయితీగా ఆ వ్యక్తిని ప్రేమిస్తుంటే.. వాళ్లపై మీకున్న ప్రేమని ఎక్స్ ప్రెస్ చెయ్యడానికి నిపుణులు కొన్ని జాగ్రత్తలు, సూచనలు చెబుతున్నారు.
అడగండి.. వినండి..
మీరు ఇష్టపడుతున్న వ్యక్తి ఏం చెప్పినా....నిజాయితీగా వినండి. అర్థం చేసుకోండి. ఇది మీరు వాళ్లకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తెలుపుతుంది. మీరు ఆ వ్యక్తి పట్ల ఆసక్తి చూపిస్తున్నారంటే ఆ వ్యక్తి కూడా అంతే ఆసక్తి మీపై చూపించాలి. 'హే బాగున్నావా?" ఏమైంది?” అంటే సరిపోదు.. అంతకు మించి వాళ్ల కష్టాలు.. ఇష్టాలకు సంబంధించి ప్రశ్నలు వెయ్యాలి. జాగ్రత్తగా విని తెలుసుకోవాలి. ఇంత పెద్ద ప్రాసెస్ కంప్లీట్ అయ్యాకే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి పెరుగుతుంది. ప్రేమ పెరిగిన దశలో ప్రపోజ్ చేస్తేనే... వాళ్లు యాక్సెప్ట్ చేస్తారు.
టైమ్ తీసుకోండి
చూడగానే నచ్చారు.. రోజూ గుండె వేగంగా కొట్టుకుంటోంది' అని అంతే వేగంగా మీ ప్రేమని వ్యక్తం చెయ్యడానికి తొందరపడకండి. మీరు ఆ వ్యక్తి పట్ల ఎంత ప్రేమగా, కేరింగ్ గా ఉన్నారో తెలుసుకోవాలని వాళ్లకూ ఉంటుంది. మీ మధుర క్షణాలు జీవితాంతం గుర్తు ఉండి పోవాలనుకుంటే.. వాళ్లను గెలుచుకోవడా నికి తొందరపడొద్దు. టైం, స్పేస్ తీసుకోండి. మీతో ఉన్నప్పుడు వాళ్లు సెక్యూర్.. రిలాక్స్ ఫీల్ అయ్యేవరకు ఆగి ఆ తర్వాత ప్రపోజ్ చెయ్యాలి.
ముచ్చట... నమ్మకం..
అపార్థం చేసుకోవడంలో తప్పేం లేదు. 'ఆ కొత్త వ్యక్తిని నమ్మాలా? వద్దా?” అనే సందేహం ఎప్పుడూ ఉంటుంది. ఈ సందేహం తీరాలంటే ఇద్దరి మధ్య నమ్మకం కుదరాలి. నమ్మకం రమ్మంటే వచ్చేది కాదు. మీరు ప్రేమిస్తున్న వ్యక్తితో నిజాయితీగా, ఆ వ్యక్తి జీవిత ప్రయాణం పట్ల సానుభూతిగా మాట్లాడినప్పుడు అది సాధ్యం అవుతుంది. ప్రతి వ్యక్తికి వాళ్లకంటూ ప్రత్యే కమైన జీవితం ఉంటుందని గుర్తించాలి. వాళ్ల కలల గురించి, కోరికల గురించి, ప్రొఫెషనల్ విషయాలు గురించి, ఫ్యామిలీ గురించి, విలువల గురించి మాట్లా డినప్పుడే ఇద్దరి మధ్య నమ్మకం బలపడుతుంది. కొత్తగా పరిచయమైనప్పుడు ఎదుటి వ్యక్తి మిమ్మల్ని
కొంచెం దూరంగా ఉండాలి..
మీరు ఆమెను లేదా అతన్ని ప్రేమిస్తున్నారని మీ మనసు సంకేతాలు ఇచ్చింది కాబట్టి టైం దొరికితే ఆ వ్యక్తి దగ్గరే వాలిపోవద్దు. వాళ్లకు తగినంత దూరం పాటించాలి. దూరంగా ఉన్నప్పుడే మీ ప్రవర్తన అవతలి వాళ్ల మనసుని గెలుస్తుంది. కలిసినప్పుడు వాళ్లతో గౌరవంగా ఉండాలి. గౌరవంగా మీ మనసు లోని విషయాన్ని బయటపెట్టాలి. దగ్గర ఉండి ఇంప్రెస్ చేయడం కంటే దూరంగా, గౌరవంగా ఉన్నప్పుడే మి మ్మల్ని వారు ప్రత్యేకంగా చూస్తారు.
సాయం చెయ్యాలి..
ఆ వ్యక్తితో స్నేహం చేశాక...వాళ్లకు తెలియని విష యాల్ని టీచ్ చెయ్యాలి. వాళ్ల జీవితంలో ముఖ్యమైన విషయాలు, కలల్ని గుర్తు చెయ్యాలి. వాళ్లకు ఆసక్తి ఉండి కూడా ఇంతవరకూ చెయ్యని పనులను వాళ్లతో చేయించాలి. వంట చెయ్యడం ఎలాగో నేర్పించడం... ఏదైనా ఆటని, సబ్జెక్ట్ ని నేర్పించడం లాంటివన్నమాట. ఇవి మీ చొరవని ప్రకటిస్తాయి. దీంతో 'మీరు ఏ కోణంలో ఆ వ్యక్తిని చూస్తున్నారు? వారికి మీరు ఎంత విలువ ఇస్తున్నారు?” అనే విషయాలు కూడా అర్థమవు తాయి. కాబట్టి ఆ వ్యక్తి ఎదగడానికి సాయం చెయ్యాలి. వాళ్లు ఏయే విషయాల్లో పూర్తిగా ఉన్నారో తెలుసుకుని నేర్పించాలి. ఇది మీ ప్రేమకు తలుపులు తెరుస్తుంది.
ఫ్రెండే వారధి
లవ్ స్టోరీ ట్రాజెడీ అయినా.. సక్సెస్ఫుల్ అయినా ఆ కథలో ఫ్రెండ్ తప్పకుండా ఉంటాడు. ఎన్నో ప్రేమలకు ఫ్రెండ్స్ వారధులు. ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఉన్నప్పు డు ఆ ప్రేమకు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తెలిసిన వ్యక్తిని నమ్మడమే చాలా కష్టం. అలాంటిది తెలియని వ్యక్తిని నమ్మాలంటే మాటలా? కొత్తగా పరిచయమైన ఇద్దరి మధ్య నమ్మకం, స్నేహం కుదరడానికి చాలా టైం పడుతుంది. కామన్ ఫ్రెండ్ ఉంటే... ఆ ఫ్రెండ్ పరిచయడం చెయ్యడంతో ఆగిపోకుం డా ఇద్దరి మధ్య నమ్మకానికి కూడా పునాది వేస్తారు. అవతలి వ్యక్తి సందేహాలని.. భయాలని తీర్చడంలో ఆ కామన్ ఫ్రెండ్ పాత్రే కీలకం.