- భవిష్యత్ తరాలకు ఆవును అందించాలి
- గవర్నర్ ను కోరిన ‘లవ్ ఫర్ కౌ ఫౌండేషన్’ చైర్మన్ జస్మత్ పటేల్
బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేసేలా చూడాలని, భవిష్యత్ తరాలకు ఆవును అందించేందుకు కృషి చేయాలని లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ కోరింది. ఫౌండేషన్చైర్మన్ జస్మత్ పటేల్, మేనేజింగ్ట్రస్టీ రిదేశ్జాగీర్దార్, భారతీయ ప్రాణి మిత్ర సంఘం అధ్యక్షుడు జస్రాజ్ శ్రీశ్రీమల్, గోవాట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు మురళీ మనోహర్ పాలోడ్ తో కలిసి శనివారం రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు వినతిపత్రం ఇచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలోని గోశాలలను సందర్శించాలని కోరారు. గోవులకు గడ్డి, దాణా, మందుల కోసం నిధులు సమకూర్చడంలో సాయం చేయాలని అభ్యర్థించారు. అనంతరం జస్మత్పటేల్మాట్లాడుతూ.. జంతు సంక్షేమ సంస్థలు చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని, మరిన్ని చేపట్టాలని గవర్నర్ సూచించినట్లు తెలిపారు. త్వరలో గోశాలలను సందర్శిస్తానని తెలిపారని, చేతనైనంత సాయం చేస్తానని హామీ ఇచ్చారని వివరించారు.