ఔను.. వాళ్లు ముగ్గురూ ఒక్కటయ్యారు!

ఔను.. వాళ్లు ముగ్గురూ ఒక్కటయ్యారు!
  • ఇద్దరు అమ్మాయిలతో యువకుడి ప్రేమ
  • ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి..  
  • నాలుగేండ్ల తర్వాత పెండ్లితో సుఖాంతం
  • 500 మంది సమక్షంలో ఒకటైన ముగ్గురు

ఆసిఫాబాద్, వెలుగు: ఔను వాళ్లు ముగ్గురూ ప్రేమించుకున్నారు. నాలుగేండ్ల తర్వాత పెండ్లి చేసుకున్నారు. ఇది ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని జైనూర్ మండలం అడ్డేసార(పూసగూడ) గ్రామానికి చెందిన ఆత్రం చత్రుషావ్, జంగుబాయి, గాదిగూడ మండలం సాంగ్వీ గ్రామానికి చెందిన సోన్ దేవి.. ఈ ముగ్గురూ కొన్నేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరు లేకుండా మరొకరు ఉండలేని పరిస్థితికి వెళ్లారు. వీరు ముగ్గురూ పెండ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.

 ఇదే విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించారు. మూడు కుటుంబాల వాళ్లు లగ్గానికి ముహూర్తం ఖరారు చేశారు. పెండ్లి పత్రికలను కూడా ముద్రించి పంచారు. బంధు మిత్రులను ఆహ్వానించారు. సంప్రదాయ పద్ధతిలో గురువారం అడ్డేసారా(పూసగూడ )లో బాజా భజంత్రీల నడుమ చత్రషావ్ తన ఇద్దరు ప్రియురాళ్లు జంగుబాయి, సోన్ దేవి మెడల్లో తాళి కట్టాడు. వచ్చిన పెద్దలు అక్షింతలు వేసి దీవించారు. ఇటీవల ఇదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతులను ఓ యువకుడు పెండ్లి చేసుకోగా.. తాజాగా ఈ పెండ్లి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.