
దెయ్యంతో ప్రేమ అనే కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన లేటెస్ట్ మూవీ లవ్ మీ ఇఫ్ యూ డేర్(Love me if you dare). దిల్ రాజు వారసుడు ఆశిష్(Ashish) హీరోగా వచ్చిన ఈ సినిమాలో బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) హీరోయిన్ గా నటించారు. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై హన్షిత రెడ్డి, హన్షిత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు అరుణ్ భీమవరం తెరకెక్కించగా.. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ కూడా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు.
మే 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, విడుదల తరువాత ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది ఈ సినిమా. ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నా.. దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం బాలేకపోవడం, కథలో కంఫ్యూజన్స్ కూడా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దాంతో ఈ సినిమా మినిమమ్ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. అప్పటినుండి లవ్ మీ ఓటీటీ విడుదల గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ నేపధ్యంలో.. సడన్ గా ఓటీటీలో దర్శనమిచ్చింది ఈ మూవీ. ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్‌లో ఎలాంటి ప్రకటన లేకుండా జూన్ 14 నుండి స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతో ఆడియన్స్ అవాక్కవుతున్నారు. మరి థియేటర్స్ లో ప్లాప్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.