లవ్‌‌‌‌‌‌‌‌ మాక్‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌ 2 చిత్రం జూన్ 14న తెలుగులో విడుదల

లవ్‌‌‌‌‌‌‌‌ మాక్‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌ 2 చిత్రం జూన్ 14న తెలుగులో విడుదల

డార్లింగ్ కృష్ణ హీరోగా నటిస్తూ, దర్శకనిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌‌‌‌‌‌‌‌ మాక్‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌ 2’.  మిలిన నాగరాజ్, అమృత అయ్యంగార్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. కన్నడలో రెండు భాగాలుగా విడుదలై విజయం సాధించిన ఈ చిత్రం రెండో భాగాన్ని ఈ నెల 14న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఎం.వి.ఆర్ కృష్ణ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం నచ్చుతుందని ఆయన చెప్పారు. నకుల్ అభయాన్కర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.