టైటిల్: లవ్, సితార
ప్లాట్‌ఫామ్: జీ5
డైరెక్టర్ : వందన కటారియా
కాస్ట్: రాజీవ్ సిద్ధార్థ, శోభిత ధూళిపాళ, జయశ్రీ, సోనాలి కులకర్ణి
సక్సెస్ ఫుల్ కెరీర్, అర్థం చేసుకునే తల్లిదండ్రులు, విపరీతంగా ప్రేమించే ప్రియుడు, ఫ్రెండ్స్‌తో సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తుంటుంది సితార (శోభిత ధూళిపాళ). జీవితం ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా సాగిపోతున్న ఆమెకి ఒకరోజు తాను గర్భవతి అయ్యానని తెలుస్తుంది. దాంతో వెంటనే అమ్మమ్మ ఇంట్లో నిరాడంబరంగా ప్రియుడు (రాజీవ్ సిద్ధార్థ)ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. అందర్నీ ఒప్పిస్తుంది. కేరళలోని అమ్మమ్మ ఇంట్లో పెళ్లి పనులు మొదలుపెడుతుంది. అంతా బాగానే ఉంది అనుకునే టైంకి సితార బుర్రలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో ఫ్యామిలీలో చీలికలు వస్తాయి.
అమ్మమ్మ (బి.జయశ్రీ) పాత్రకు నేటి జనరేషన్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ జనరేషన్ ఆలోచనా విధానానికి సితార పాత్ర ఎగ్జాంపుల్‌గా కనిపిస్తుంది. అమ్మాయిలు ఇండిపెండెంట్‌గా ఉండడం అంటే నిజాయితీతో, బాధ్యతతో వ్యవహరించడం అని చూపించారు సితార పాత్ర ద్వారా. అలాగే కావాల్సిన వాళ్లు తప్పు చేసినప్పుడు వాళ్లని దూరం చేసుకోకుండా వాళ్లని క్షమించి మరోసారి తప్పు చేయకుండా చూసుకోవడం ఎలా అనే పాయింట్స్ కూడా టచ్ చేశారు ఇందులో.
హేమ (సోనాలి కులకర్ణి) బోల్డ్ మైండ్ సెట్‌కి, హద్దులు దాటడానికి మధ్య ఉన్న చిన్నపాటి తేడాను చాలా బాగా వివరిస్తుంది. ప్రతి కుటుంబంలోనూ పైకి చెప్పుకోలేని ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యను పెద్దది చేసుకోకుండా గుర్తించి, పరిష్కరించుకోవడం ఎంత ముఖ్యం అనేది చెప్తుంది. అంతేకాకుండా సరదాగా పెట్టుకొనే ఎఫైర్లు కుటుంబం మొత్తాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయనే విషయాన్ని పాజిటివ్‌గా చెప్పిన విధానం బాగుంది. ఇదంతా సరే అసలు ఇంతకీ సితార పెళ్లి జరిగిందా? సితార మనసులో తలెత్తిన ప్రశ్నలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాలి.