రన్ టైమ్ -2 గంటల 37 నిమిషాలు
నటీనటులుః నాగచైతన్య,సాయి పల్లవి,ఈశ్వరీ రావు,రాజీవ్ కనకాల,దేవయాని,ఉత్తేజ్ తదితరులు
సినిమాటోగ్రఫీః విజయ్ సి.కుమార్
మ్యూజిక్ః పవన్ సి.హెచ్
ఎడిటింగ్ః మార్తాండ్.కె.వెంకటేష్
నిర్మాతలుః నారయణ్ దాస్ నారాంగ్,పుస్కూర్ రామ్మోహన్ రావు
రచన,దర్శకత్వం -శేఖర్ కమ్ముల
కథేంటి?
రేవంత్ (నాగ చైతన్య) పేదవాడు.పల్లెటూరు నుండి హైదరాబాద్ కు వచ్చి జుంబా డాన్స్ సెంటర్ నడుపుతూ కష్టపడి బతుకుతుంటాడు.అదే ఊరికి చెందిన మౌనిక (సాయి పల్లవి) అక్కడ ఉండటం ఇష్టం లేక హైదరాబాద్ కు వచ్చి జాబ్ సెర్చ్ లో ఉంటుంది.కానీ జాబ్ రాదు.తన డాన్స్ టాలెంట్ చూసి జుంబా సెంటర్ లో జాయిన్ అవ్వమని అడుగుతాడు.ఇద్దరు కలిసి సక్సెస్ పుల్ గా నడుపుతంటారు.తర్వాత ఇద్దరు ప్రేమలో పడతారు. వేర్వేరు కులాల కు చెందిన వారు కావడం వల్ల ఊర్లో వాల్లకు తెలిస్తే చంపేస్తారని భయపడతారు. ఓ పక్క మౌనిక వాళ్ల బాబాయి (రాజీవ్ కనకాల)ను చూస్తే భయంతో వణికి పోతుంది.మరి ఆ భయం దేనికి? వాళ్ల ప్రేమ ను ఎలా జయించారు అనేది కథ.
విశ్లేషణః
లవ్ స్టోరీ మనసుకు తాకుతుంది.సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల మరోసారి ఆలోచింప జేసే సినిమాను తీసాడు.సమాజాన్ని ప్రశ్నించాడు.సొసైటీలో ప్రస్తుతం బర్నింగ్ టాపిక్స్ గా ఉన్న కుల వివక్ష, లైంగిక వేధింపులను ఇతివ్రుత్తంగా తీసుకుని కథ ను రూపొందించాడు.మేజర్ పార్ట్ వరకు ఈ కథ నచ్చుతుంది. కాకపోతే క్లైమాక్స్ పోర్షన్స్ హడావుడి గా ముగించడం వల్ల కొంత అసంత్రుప్తి కలుగుతుంది.ఫస్టాఫ్ స్లోగా మొదలైనా.. తర్వాత ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. సెకండాఫ్ కథలోకి వెళ్లి ఎమోషనల్ గా కట్టిపడేస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ మనసుకు హత్తుకుంటుంది.వీటికి తోడు మంచి పాటలు సినిమా గ్రాఫ్ ను పెంచాయి. అప్పటివరకు మంచి ఫ్లో లో సాగుతున్న సినిమా క్లైమాక్స్ కు వచ్చే సరికి కాస్త చతికిల పడుతుంది. ఏదో మిస్ అయిన ఫీల్ కలుగుతుంది. క్లైమక్స్ ను తొందరగా ముగించారని పిస్తుంది.అది చిన్న కంప్లైంట్ యే. ఓవరాల్ గా లవ్ స్టోరీ మనసుకు హత్తుకుంటూ,ఆలోచింపజేస్తుంది. ఈ వారం ఫ్యామిలీతో థియేటర్ కు వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు..
నటీనటుల పర్ఫార్మెన్స్ః
నాగ చైతన్య నటుడిగా ఓ మెట్టు ఎక్కేసాడని చెప్పాలి.తెలంగాణ కుర్రాడి గా ఆ యాస,ఆహార్యం బాగున్నాయి. తన కెరీర్ లో ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. డాన్స్ కూడా చాలా బాగా చేశాడు.ఇక సాయి పల్లవి తన నటన,డాన్స్ లతో దుమ్ము లేపింది. ఫిదా లో ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ అదరగొట్టిన పల్లవి ఈ సినిమాలో సిగ్గు,భయం ఉన్న మౌనిక పాత్రలో ఒదిగిపోయి నటించింది.నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రాజీవ్ కనకాల రాణించాడు.తెలంగాణ ఊళ్లల్లో ఉండే పొగరుబోతు పటేల్ గా మెప్పించాడు.తల్లి పాత్రలో ఈశ్వరీ రావు చాలా బాగా నటించింది.పల్లవి తల్లిపాత్రలో దేవయాని బాగుంది.ఉత్తేజ్ పాత్ర బాగుంది.
టెక్నికల్ వర్క్
విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది.పవన్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది.పాటలు వినసొంపుగా ఉన్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సీన్లను బాగా ఎలివేట్ చేశాడు.ఇక ఆర్ట్ డైరెక్షన్,ప్రొడక్షవాల్యూయ్స్ బాగున్నాయి.ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది. నిర్మాతలు రాజీ పడకుండా ఖర్చు పెట్టారు.శేఖర్ కమ్ముల రాసుకున్న సంభాషణలు ఆలోచింప చేస్తాయి.
బాటమ్ లైన్ : ఆలోచింప చేసే "లవ్ స్టొరీ"