ఫిబ్రవరి 14.. ఈరోజు వచ్చిందట చాలు యువత యెగిరి గంతేస్తారు. ఓపక్క అబ్బాయిలు, మరోపక్క అమ్మాయిలు తమ మనసుకు నచ్చినవారికి తమ ఇష్టాన్ని తెలియజేసి కొత్త ప్రయాణాన్ని మొదలుపెడతారు. అందుకే ఈ రోజుకు చాల ప్రత్యేకత ఉంది. కాబట్టి తమకు కాబోయే పార్ట్నర్ తో ఆ రోజంతా హ్యాపీగా గడపాలని ప్లాన్ చేసుకుంటారు. పార్కులు, రెస్టారెంట్ లకు వెళ్లి ఏకాంతంగా సమయం గడపాలని అనుకుంటారు. కొందరేమో సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. అలాంటి వారికోసమే అలనాటి క్లాసిక్ లవ్ స్టోరీలని రీ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్.
అలా ఈ ప్రేమికుల దినోత్సవానికి కూడా గుండెల్ని పిండేసే ప్రేమకథలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో ముందుగా పవన్ కళ్యాణ్ తొలిప్రేమ ఉంది. 1998లో వచ్చిన ఈ సినిమాకు ప్రేమికుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ఆ రోజున ఈ సినిమాను చూసేందుకు ఇష్టపడతారు ప్రేమ జంటలు. ఇక సిద్దార్థ్, బేబీ షామిలి జంటగా వచ్చిన ఓయ్ సినిమా కూడా రీ రిలీజ్ కానుంది. ప్యూర్ లవ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తమిళ నటుడు సూర్య హీరోగా వేసిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా కూడా రీ రిలీజ్ కానుంది. అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చినా ఈ సినిమాకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక
ఇటీవలే విడుదలై పాన్ ఇండియా లెవల్లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచినా సీతారామం సినిమా కూడా రీ రిలీజ్ కానుంది. యుద్ధంలో రాసిన ప్రేమకథ అంటూ సెన్సిబుల్ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా కూడా ప్రేమికుల రోజుల ప్రేమ జంటలను అలరించనుంది. కేవలం తెలుగులోనే కాదు హిందీలో పలు ప్రేమ కథ చిత్రాలు రీ రిలీజ్ కానున్నాయి. వాటిలో.. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ తో పాగల్ హై. మొహబ్బతే లాంటి సినిమాలున్నాయి. మరి ప్రేమికుల రోజున వస్తున్న ఈ ప్రేమకథల్లో ఏ సినిమాకి ఎక్కువ ఆధారన దక్కుతుందో చూడాలి.
Also Read: ముద్దు పెట్టిస్తాడా.. కత్తి పట్టిస్తాడా.. మాస్ దర్శకుడితో విజయ్ సినిమా!