దేశ ముదురు : తండ్రిని చంపిన కూతురి కేసులో.. మూడు లవ్ స్టోరీలు..!

తండ్రిని చంపిన కూతురు.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్న తండ్రిని.. ఇంట్లోనే కొట్టి చంపిన కూతురు.. ఈ ఘటన జరిగిన తర్వాత.. ఈ కేసులో కొత్త ట్విస్టుల బయటపడుతున్నాయి. కన్న తండ్రిని అత్యంత కిరాతకంగా చంపిన కూతురు హరిత.. విచారణలో చెబుతున్న విషయాలు షాక్ కు గురి చేస్తున్నాయి. 

హరిత చదువుకున్నది బీఎస్సీ, బీఈడీ అయినా.. ఆలోచనలు మాత్రం చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. ముగ్గురితో ప్రేమాయణం నడిపినట్లు చెబుతున్నారు పోలీసులు. హరిత మదనపల్లెకు చెందిన రమేశ్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటుంది. అతనికి తన బంగారు నగలు ఇచ్చింది. అతను వాటిని తాకట్టు పెట్టి 11 లక్షల 40 వేల రూపాయలు క్యాష్ చేసుకున్నాడు. సాయి కృష్ణ అనే మరో యువకుడికి 8 లక్షల రూపాయలు ఇచ్చింది హరిత.. అంతేనా.. వీళ్లిద్దరే కాకుండా హరీష్ రెడ్డి అనే మరో యువకుడితోనూ సన్నిహితంగా ఉంటోంది హరిత. ఈ ముగ్గురికి తన దగ్గర ఉన్న డబ్బులు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఇచ్చింది. ఈ ముగ్గురితోనూ ఎంతో క్లోజ్ గా ఉంటూ.. వాళ్లు అడిగినప్పుడు తన బంగారం, డబ్బులు ఇచ్చినట్లు విచారణలో వెల్లడించింది హరిత..

మరి హరితకు ఇంత డబ్బు, బంగారం ఎక్కడిది అంటారా.. తన పెళ్లి కోసం స్కూల్ టీచర్ అయిన తండ్రి దొర స్వామి సంపాదించిందే.. రెండేళ్ల క్రితం హరిత తల్లి అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత కూతురి పెళ్లి కోసం దాచిన బంగారం, డబ్బు అంతా హరిత బ్యాంక్ అకౌంట్ లో వేశాడు తండ్రి దొరస్వామి. 

తన దగ్గర ఉన్న డబ్బు, బంగారాన్ని తనతో సన్నిహితంగా ఉంటున్న కుర్రోళ్లకు ఇచ్చినట్లు విచారణలో వెల్లడించింది హరిత. నిత్యం ఫోన్ లో చాటింగ్  చేయటం.. ఫోన్లు మాట్లాడటం ద్వారా హరిత తన విషయాలు అన్నీ వాళ్లకు చెప్పేదని అంటున్నారు పోలీసులు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 2024, జూన్ 13వ తేదీన తండ్రి దొరస్వామిని కుమార్తె హత్య చేయగా.. ఆ తర్వాత అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేశారు. ఆ విచారణలో ఈ లవ్ స్టోరీలు వెలుగులోకి వచ్చాయి.