కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించాడన్న కారణంతో యువకుడు, అతని తల్లిని అమ్మాయి బంధువులు కత్తులతో పొడిచారు. యువకుడి శరీరంలోనే కత్తులను దించి వెళ్లారు. స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అబ్బాయిది చిగురుమామిడి కాగా.. అమ్మాయిది జగిత్యాల. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.