
జగిత్యాల, వెలుగు: ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమించిన ఓ యువకుడు.. కుటుంబసభ్యులను ఒప్పించి పెండ్లి చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లేశ్.. మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ అంజలితో రెండేండ్ల కింద ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్న ఆ జంట.. యువకుడి ఇంట్లో ఒప్పించి బంధువులు, ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సమక్షంలో బుధవారం ఘనంగా వివాహం చేసుకున్నారు.