ప్రేమించి మోసగించాడని యువతి ధర్నా

ప్రేమించి మోసగించాడని యువతి ధర్నా

సిద్దిపేట రూరల్, వెలుగు: తనను ప్రేమించి ఒక బిడ్డకు తల్లిని చేసి పెళ్లిచేసుకోమని అడిగితే ముఖం చాటేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఆమె కథనం ప్రకారం.. సిద్దిపేట పట్టణ పరిధిలోని ఇమాంబాద్ కు చెందిన  గొడుగు గణేశ్,  తాను కొంతకాలంగా ప్రేమించుకున్నామంది. గణేశ్ తనను ప్రెగ్నెంట్​చేసి పెళ్లి చేసుకోమని అడగడంతో సంబంధంలేదని చెబుతున్నాడని ఆరోపించింది.

ఈ విషయమై  గతంలో కుటుంబ సభ్యులతో కలిసి వన్ టౌన్ పీఎస్​లో ఫిర్యాదు చేశానని, కేసు కోర్టులో ఉండగానే తాను ఆడ శిశువుకు జన్మనిచ్చానని చెప్పింది. డీఎన్​ఏ టెస్టులు పూర్తియిన తర్వాత ఆ శిశువుకు తండ్రి అతడే అని రుజువైందని, ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ఇబ్బందిపెడుతున్నాడని పేర్కొంది. తనకు తన శిశువుకు ఆధారం చూపించాలని గత వారం నిందితుడి ఇంటి ముందు బైఠాయించగా పోలీసులు పెద్దల సమక్షంలో మాట్లాడుకోమని పంపించారంది. కానీ పెద్దలు దీనిపై స్పందించకపోవడంతో గురువారం మహిళా సంఘాల సాయంతో కుటుంబ సభ్యులతో కలిసి మళ్లీ గణేశ్ ఇంటి ముందు బైఠాయించింది.