గర్ల్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చెయ్యాలని స్టార్ హీరో తండ్రిపై ప్రాంక్. కట్ చేస్తే జైలుకి..

గర్ల్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చెయ్యాలని స్టార్ హీరో తండ్రిపై ప్రాంక్. కట్ చేస్తే జైలుకి..

ఈ మధ్య కొందరు ప్రాంక్ పేరుతో చేసే పనుల కారణంగా లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. ఐతే ఓ యువకుడు తన ప్రేయసిని ఇంప్రెస్ చెయ్యాలని ఏకంగా బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ పై బెదిరింపులకు పాల్పడుతూ ప్రాంక్ చేసి చివరికి తన ప్రేయసితో కలిసి జైలుపాలైన ఘటన ముంబైలో  వెలుగులోకి వచ్చింది.

పూర్తీ వివరాల్లోకి వెళితే   ఉమర్ ఆసిఫ్ షేక్ మరియు అతడి ప్రేయసి అష్మా షేక్   బుధవారం (సెప్టెంబర్ 19) రోజున బాంద్రా ప్రొమెనేడ్‌లో ప్రాంతంలో స్కూటర్ పై తిరిగాడు. ఇదే సమయంలో సలీం ఖాన్‌ మార్నింగ్ వాక్ కి వెళ్లొచ్చి తీసుకుంటున్నాడు. 

Also read:-మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ సింగిల్ రిలీజ్..

ఇది గమనించిన ఆసిఫ్ తన ప్రేయసిని ఇంప్రెస్ చేసేందుకు ఏకంగా సలీం ఖాన్ ని లారెన్స్ బిష్ణోయ్‌ అనే గ్యాంగ్ స్టర్ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆసిఫ్ మరియు తన ప్రేయసి వెళుతున్న స్కూటర్ నెంబర్ ని నోట్ చేసుకుని పోలీసులకి సమాచారం అందించాడు. 

రంగంలోకి దిగిన పోలీసులు ఆసిఫ్ మరియు అతడి ప్రేయసి అష్మాని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ విచారణలో కేవలం ఆసిఫ్ కేవలం తన ప్రేయసిని ఇంప్రెస్ చేసేందుకు ఇలా బెదిరిస్తూ ప్రాంక్ చేశానని పోలీసుల ఎదుట చెప్పాడు. దీంతో వీరిద్దరిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.