రిసార్ట్లో ప్రేమజంట ఆత్మహత్య..అసలేం జరిగింది.?

సంగారెడ్డి జిల్లా  మునిపల్లి మండలం బుసరెడ్డి పల్లి గ్రామ శివారులో విషాదం చోటుచేసుకుంది.  హరిత రిసార్ట్ లోని గదిలో  ప్రేమ జంట ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  జనవరి 9న  సాయంత్రం హరిత రిసార్ట్ లో రూమ్ అద్దెకు తీసుకున్నారు యువతీ యువకుడు.  జనవరి 10న మధ్యాహ్నం అయినా గది తెరవకపోపవడంతో  రిసార్ట్స్ యాజమాన్యం పోలీసుల సమక్షంలో డోర్ తెరిచిచూడగా  ఇద్దరు ఫ్యాన్ కు ఉరేసుకుని   విగత జీవులుగా పడి ఉన్నారు . పోలీసులు డెడ్ బాడీని కిందకు దించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతులు నారాయణఖేర్ పరిధిలోని నిజాంపేట వాసులు ఉదయ్ కుమార్, మౌనికగా పోలీసులు గుర్తించారు. ఇరు కుటుంబాలు వీళ్ల  ప్రేమ పెళ్లికి  ఒప్పుకోలేదనే కారణంతోనే  ప్రేమికులిద్దరు ఆత్మహత్య చేసుకున్నారని  పోలీసుల ప్రాథమికంగా నిర్దారించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ALSO READ | ఘోరం.. ఫ్రెండ్స్ డబ్బులిస్తానంటే.. రేప్ చేయడానికి ఒప్పుకున్నాడు.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన