- బాసర రైల్వేస్టేషన్ సమీపంలో సూసైడ్
- మృతులు నిజామాబాద్ వాసులు
నిజామాబాద్ క్రైమ్, వెలుగు : నిజామాబాద్ కు చెందిన ఇద్దరు ప్రేమికులు బుధవారం రాత్రి బాసర రైల్వే స్టేషన్ సమీపంలో నర్సాపూర్ నాగర్సోల్ తఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. యువకుడు కోటగల్లికి చెందిన సూరం శ్రీకాంత్ (28)గా, యువతిని సీతారాంనగర్ కాలనీకి చెందిన నందిత(20)గా గుర్తించారు. శ్రీకాంత్ విశ్వ భారతి స్కూల్లో టీచర్కాగా, నందిత నిశిత డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. శ్రీకాంత్ హైదరాబాద్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వచ్చాడు. నందిత ఎప్పటిలాగే కాలేజీ సమయానికి ఇంటి నుంచి వెళ్లింది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి విచారణ జరుపుతున్నారు.