మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రేమ విఫలం కావడంతో మామిడిగట్టుకు చెందిన నాంపల్లి సంగీత(23) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణవార్త తెలుసుకున్న ప్రియుడు చిత్తాపూర్ వాసి భగవాన్(24) కూడా పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు.
సంగీత, భగవాన్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి ప్రేమకు సంగీత కుటుం సభ్యులుల ఒప్పుకోలేదు. ఈ క్రమంలో సంగీతకు మార్చి 14 వ తేదీన పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. పెళ్లిచూపులు ఇష్టం లేని సంగీత ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడింది.
ప్రియురాలు చనిపోయిందన్న విషయం తెలుసుకున్న ప్రియుడు భగవాన్ పురుగుల మందుతాగి అత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.