రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య ఘటన సంచలనంగా మారింది. ఏపీ రాష్ట్రం గుంటూరు జిల్లా పెదకాకాని రైల్వే ట్రాక్ పై ఓ జంట మృతదేహాలు.. 2024 అక్టోబర్ 18వ తేదీ ఉదయం కలకలం రేపాయి. పోలీసుల విచారణలో.. వారి వివరాలు ఇలా ఉన్నాయి..
22 ఏళ్ల దానబోయిన మహేశ్, 21 ఏళ్ల నండ్రు శైలజ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెదకాకాని గ్రామానికి చెందిన మహేశ్, నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలజకు హైదరాబాద్ లో పరిచయం అయ్యింది. డిప్లొమా చదివిన మహేశ్.. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ మొబైల్ స్టోర్‌లో పని చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న శైలజతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
Also Read :- ప్రియుడిని బాక్సులో పెట్టి తాళం వేసింది
పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వీరు.. ఇంట్లో వాళ్లకు చెప్పారు. యువకుడి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. అయితే యువతి శైలజ ఫ్యామిలీ మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో దసరా సమయంలో శైలజ, మహేశ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. యువతి కుటుంబ సభ్యులు వెతకటం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే.. పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్‌పై వీరి మృతదేహాలు ఉన్నట్లు.. పోలీసులు గుర్తించారు.