AUS vs PAK 2nd Test: స్టేడియంలో జంట రొమాన్స్.. స్క్రీన్‌పై చూపించిన కెమెరామెన్

ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు హాజరైన ఓ ప్రేమ జంటకు ఊహించని అనుభవం ఎదురైంది. ప్రేమికులిద్దరూ రొమాన్స్‌లో మినిగివుండగా కెమెరామెన్ ఆదృశ్యాలను స్క్రీన్‌పై చూపించాడు. దీంతో వారిద్దరి శృంగార లీలలు స్టేడియంలో ఉన్న స్క్రీన్లతో పాటు టీవీల్లోనూ టెలికాస్ట్ అయ్యాయి. వెంటనే తాము స్క్రీన్‌పై కనిపిస్తున్నట్లు గ్రహించిన సదరు ప్రేమికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పోరాడుతున్న పాక్

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో టెస్ట్(బాక్సింగ్ డే టెస్ట్)లో పాకిస్థాన్ ఓటమి నుంచి గట్టెక్కేందుకు పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 316 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. పాకిస్తాన్ 264 ప‌రుగుల‌కు కుప్పకూలింది. అనంత‌రం కంగారూలు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ప్రస్తుతానికి ఆసీస్ 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా రెండు రోజుల సమయం మిగిలివుండటంతో ఈ  మ్యాచ్‌లో ఫలితం వచ్చేలా కనిపిస్తోంది.

కాగా, తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఈ టెస్ట్ కూడా ఓడితే సిరీస్ చేజారినట్టే. మరోవైపు సఫారీ పర్యటనలో భారత జట్టు పరిస్థితి దాదాపు అలానే ఉంది.