స్మార్ట్ ఫోన్ కొనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు అందరూ. ఏ ఫోన్ కొనాలి? కెమెరా క్వాలిటీ , స్టోరేజీ ఎంత ఉండాలి? బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది? ఇలా ప్రతిదీ చూసి కొంటారు. అయితే స్మార్ట్ఫోన్ల ధరలు వేలల్లో ఉన్నప్పటికీ కొన్ని ఫోన్లు మాత్రం పదివేల లోపే ఉన్నాయి. అవి మంచి
ఫీచర్లతో, బెస్ట్ చాయిస్‌గా నిలుస్తు న్నాయి. అలాంటి ఫోన్లే ఈ మధ్య ట్రెండింగ్‌లో ఉన్నాయి.
రెడ్‌మీ 9 ప్రైమ్
బడ్జెట్ ఫోన్లలో అయినా, ఫీచర్లలో అయిన రెడ్‌మీ తన బ్రాండ్‌ను కొనసాగిస్తుంది. ఎప్పటికప్పుడూ తాజా అప్డేట్లలో రెడ్‌మీ ముందు ఉంటుంది. అందుకే ఇండియాలో రెడ్మీకి ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ఈమధ్య కాలంలో రెడ్ మీ9 ప్రో బడ్జెట్ ధరకే వస్తుంది. ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగిన ఫోన్లలో ఇది కూడా ఒకటి. 6.53 ఈంచుల డిస్‌ప్లే కలిగి, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ ను కలిగి ఉంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో కెపాసిటీ ఉంది. వెనుక భాగంలో క్వాడ్ కెమెరాలు ఉన్నాయి. ఇది 13+8+5 ఎంపీల అల్ర్టా వైడ్, మైక్రో సెన్సర్ల కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సల్స్ ఉంది. 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 10 MIUI 12 తో రన్ అవుతుంది. ధర రూ. 9,999 . దీంతో పాటు Poco M2 కూడా ఇంచుమించు ఇవే ఫీచర్లతో ఉంది. అయితే, రెడ్‌మీ కంటే వెయ్యి రూపాయలు తక్కువకే లభిస్తోంది. 4 GB RAM/ 64 GB స్టోరేజీ కెపాసిటీ కలిగిన Poco M2 ధర రూ. 8,999.
ఒప్పో ఎ15
డైనమిక్ బ్లాక్ , మిస్టరీ బ్లూ రెండు రంగులలో మార్కెట్లో ఉంది. 6.52- ఇంచుల డిస్‌ప్లే వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్‌తో వస్తోంది, మైక్రో ఎస్డీ కార్డును ఉపయోగించి స్టోరేజ్ ను మరింత పెంచుకోవచ్చు. 3 జీబీల ర్యామ్, 32 జీబీల స్టోరేజ్ ఉంది. దీంట్లో మూడు కెమెరాలు ఉన్నాయి. 13+2+2 బ్యాక్ కెమెరాలు, 5 ఎంపీల ఫ్రంట్ కెమెరా ఉంది. 4230 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉన్న దీని ధర రూ. 10, 900.
పోకో M3
బడ్జెట్ ఫోన్లలో పోకో ఎం3 టాప్ ప్లేస్ లో నిలుస్తుంది. అద్భుతమైన ఫీచర్లతో పాటు.. తక్కువ ఖర్చు కూడా. 6.53 ఈంచుల ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లేతో గొరిల్లా గ్లాస్ తో వస్తోంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 చిప్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 4 జీబీ+ 64 జీబీఇంటర్నల్ సోరేజీ కెపాసిటీ ఈ ఫోన్‌ది. దీనికి మూడు కెమెరాలు ఉన్నాయి. 48 ఎంపీల ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ కాంబినేషన్‌తో ఈ కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 8 మెగా పిక్సెల్స్. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ ఉన్న దీని ధర ఇండియాలో రూ. 9,999.
రియల్‌మీ సి 21 వై
తక్కువ ధర పలికే ఫోన్లలో రియల్ మీ సీ 21 ఒకటి. మంచి ఫీచర్లు ఉన్నాయి. 6.5- ఇంచుల డిస్‌ప్లే ఉంది. అది కూడా డ్రాప్-నాచ్. 4 GB ర్యామ్, 64 GB స్టోరేజీ వేరియేషన్లు ఉన్నాయి. మైక్రో SD కార్డ్ సాయంతో స్టోరేజీని పెంచుకోవచ్చు. దీనికి ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ ఫెసిలిటీ కూడా ఉంది. 13 మెగాపెక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా + డెప్త్ సెన్సర్, 5,000 ఎంఏ హెచ్ బ్యాటరీ ఉంది. ఇండియా లో దీని ధర రూ. 8,999.