తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కేంద్రం ప్రకటించింది. 2023, నవంబర్ 15వ తేదీ బుధవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది.దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.
ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నవంబర్ 15వ తేదీ బుధవారం నాటికి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.బంగాళాఖాతం ఆగ్నేయం- నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. దీంతో బుధవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
ALSO READ :బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
పశ్చిమం- మధ్య బంగాళాఖాతం వైపు అల్పపీడనం క్రమంగా విస్తరిస్తుందని భారత వాతావరణ కేంద్రం చెప్పింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.