ఏపీకి మరో గండం వచ్చేసింది.. నిన్నా మొన్నటి భారీ వర్షాలు, వరదలకు విజయవాడ మునిగిపోయింది. ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న విజయవాడపై మరో పిడుగు.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. 2024, సెప్టెంబర్ 5వ తేదీన ఏర్పడనున్నట్లు తేల్చి చెప్పింది విశాఖ వాతావరణ కేంద్రం.
దీంతో వరదల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడ ప్రజలను ఈ వార్త మరింత భయాందోళనకు గురి చేస్తోంది.ఈ నెల 5న బంగాళాఖాతంలో ఏర్పడే మరో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మరో మూడురోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
Also Read :- వరద బాధితులకు అండగా టాలీవుడ్
ఈ క్రమంలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, యానాం, ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిందింది. మరోవైపు విజయవాడలో మంగళవారం తగ్గుముఖం పట్టిన వర్షం రాత్రి మళ్ళీ మొదలై ఓ మోస్తరుగా కురుస్తోంది.