ఆంధ్రప్రదేశ్‌కు ఆ రాష్ట్ర వాతావరణ కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా రూపాంతరం చెందిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడన ప్రభావంతో పశ్చిమగోదావరి, వైఎస్సార్, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కృష్ణ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అలాగే కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా తేలికపాటి వర్షాలు పడొచ్చని అంచనా వేశారు.
ALSO READ | తిరుపతి ఎయిర్‌పోర్టులో హైదరాబాద్ ప్రయాణికుల ఆందోళన
వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న చెరువులు, నదులు, రిజర్వాయర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని, సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. వాతావరణ కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో సహయక బృందాలు.. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.