లోయర్​ ట్యాంక్​ బండ్​ డీబీఆర్​ మిల్లులో మహిళా మృతదేహం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

లోయర్​ ట్యాంక్​ బండ్​ డీబీఆర్​ మిల్లులో మహిళా మృతదేహం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

హైదరాబాద్​ లో  మహిళా మృతదేహం లభ్యమైంది.  లోయర్ ట్యాంక్ బండ్ డిబిఆర్ మిల్లు లో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు.  ఆరు నెలల క్రితం హత్య చేసి  డీబీఆర్ మిల్​ మూడో అంతస్తులో ఉన్న సంపులో పడేశారు.  అస్తిపంజరంగా మారింది.  డీబీఆర్​ మిల్లులోని నీటి సంపులో మృతదేహాన్ని  చూసిన సెక్యూరిటి సిబ్బంది దోమలగూడ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై  కేసు నమోదు చేసి .. అస్థిపంజరాన్ని పోస్ట్​మార్టానికి తరలించారు.