న్యూఢిల్లీ, వెలుగు: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో నోటాను అతి తక్కువ మంది ఓటర్లు ఉపయోగించుకున్నారు. మహారాష్ట్రలో 1.2% మంది, జార్ఖండ్లో 0.75% మంది ఓటర్లు నోటా మీటను నొక్కారు. మహారాష్ట్రలో 65.2 శాతం ఓటింగ్ నమోదవ్వగా, 1.2 శాతం మంది నోటాకు ఓటేశారు.
జార్ఖండ్ లో 67 శాతం ఓటింగ్ రికార్డవ్వగా, 0.75 శాతం మంది నోటా మీటను నొక్కారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 2013లో ఎన్నికల సంఘం(ఈసీ) తొలిసారిగా ఈవీఎంలలో నోటా బటన్ ను ప్రవేశపెట్టింది. పోటీలో నిలిచిన అభ్యర్థుల్లో తమకెవరు నచ్చలేదని ఓటర్లు నోటా మీటను నొక్కుతారు.