బ్రాండెడ్​ మందు పేరిట చీప్​ లిక్కర్​ అమ్మకాలు

బ్రాండెడ్​ మందు పేరిట  చీప్​ లిక్కర్​ అమ్మకాలు
  • ఎక్సైజ్ ఎస్​టీఎఫ్​ పోలీసుల అదుపులో నిందితుడు

  • ఒకరు పట్టుబడ్డారు..మరొకరు పారిపోయారు

  • ఆరు ఫుల్ బాటిల్స్ స్వాధీనం 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖరీదైన మద్యం బాటిళ్లలో చీప్ లిక్కర్ నింపి డిస్కౌంట్ పేరుతో అమ్ముతున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎస్‌‌‌‌టీఎఫ్ టీం లీడర్ నంద్యాల అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్​లోని ఇందిరానగర్‌‌‌‌‌‌‌‌లో ఈవెంట్ మేనేజర్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్న ఒడిశాకు చెందిన సత్యభరత్ శైల తన ఇంట్లో ఖరీదైన మద్యం బాటిళ్లలో నాసిరకం మద్యాన్ని నింపి మార్కెట్ ధరల కంటే రూ. వెయ్యి తక్కువకే కల్తీ మద్యాన్ని అమ్ముతున్నాడు.

 ఈ విషయం ఎక్సైజ్ పోలీసులకు తెలియడంతో రైడ్ చేయగా.. సత్యభరత్ ఇంట్లో ఆరు షివాజ్‌‌‌‌ రీగల్, మరో రెండు మద్యం ఫుల్ బాటిల్స్, 42 ఖాళీ మద్యం బాటిళ్లు, 128 మద్యం బాటిళ్లను, స్వాధీనం చేసుకున్నారు. రూ. 40 వేల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌‌‌‌ సూపరింటెండెంట్, ఎస్‌‌‌‌టీఎఫ్‌‌‌‌ టీం లీడర్ నంద్యాల అంజిరెడ్డి తెలిపారు. నకిలీ మద్యం తయారు చేస్తున్న వెస్ట్‌‌‌‌ బెంగాల్‌‌‌‌కు చెందిన మలీనా దాసును అరెస్టు చేశారు.

 ప్రధాన నిందితుడు సత్య భరత్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.  కల్తీ మద్యం ముఠాను పట్టుకున్న వారిలో ఎస్ టి ఎఫ్  సీఐ చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుల్‌‌‌‌ భాస్కర్ రెడ్డి అజీమ్, శ్రీధర్, కానిస్టేబుళ్లు రాకేశ్, ప్రకాశ్, మహేశ్ ఉన్నారు. ఎస్టిఎఫ్ టీంను ఎక్సైజ్ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి అభినందించారు