నిజామాబాద్ పట్టణ కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో చలి పెరుగుతోంది. ఉదయం పూట చలిగాలులు వీస్తున్నాయి. దీంతో పాటు పొద్దెక్కినా పొగమంచు పోతలేదు. సిటీ రోడ్లను, పల్లెలలను మంచు కమ్మేస్తోంది. ఉదయం 7:30 అవుతున్నా సూర్యుడు కనిపిస్తలేడు. గ్రామాల్లో యువకులు పొగ మంచులోనూ వాకింగ్‌కు వెళ్తూ కనిపిస్తున్నారు. -ఫొటోగ్రాఫర్, నిజామాబాద్, వెలుగు
దేశానికి ఆదర్శంగా బీఆర్ఎస్
డిచ్పల్లి, వెలుగు: బీఆర్ఎస్ పాలన దే శానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రాం పూర్, మిట్టాపల్లి, నర్సింగ్‌పూర్ గ్రామాల్లో బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలకు లబ్ది చేకూర్చేలా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఇందిరా లక్ష్మినర్సయ్య, పద్మారావు, సాయిలు, సర్పంచ్ లు తిరుపతి, గణేశ్, నర్సయ్య, ఎంపీటీసీ లు సూజాత రవి, బాలగంగాధర్, గణేశ్, లీడర్లు గంగాధర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
నిజామాబాద్ మాస్టర్ ప్లాన్‌ను సవరించాలె
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ నూడా మాస్ట ర్ ప్లాన్ లోని లోపాలను సరిదిద్దాలని, అభ్యంతర ఫిర్యాదుదారులతో మున్సిపల్ ఆఫీసర్లు చర్చించాలని మాస్టర్ ప్లాన్ బాధితుల కమిటీ డిమాండ్ చేసింది. జిల్లా కేంద్రంలో ఆదివారం మాస్టర్ ప్లాన్ బాధితుల కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. కమిటీ కన్వీనర్ కే రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. గాయత్రి నగర్, రేడియో స్టేషన్, నాగారం రోడ్డు వరకు ప్రతి పాదించిన 100 ఫీట్ల రోడ్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ముఖ్య నాయ కులు అశోక్, రాములు ,రాజు, పుండరీ, సతీష్, గం గాధర్, విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.
రైతుల భూములతో వ్యాపారమా?
ఆర్మూర్, వెలుగు: రైతుల భూములతో ప్రభుత్వం వ్యాపారం చేయడం సరైనది కాదని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. ఆర్మూర్ లో ఆదివారం కుమార్ నారాయణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలో సాగు భూముల్లో ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తామంటున్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం కొద్ది మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికార పార్టీ నేతల లబ్ధికోసం చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి ప్రజలను, రైతులను గందరగోళానికి గురిచేసిందన్నారు. భూ సమస్యలు పరిష్కారం కోసం కోర్టులు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారని అన్నారు. సీపీఐ ఎం.ఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, రాష్ట్ర నాయకులు వి. ప్రభాకర్, జిల్లా నాయకులు ఎం.నరేందర్, బి.దేవారం, ఎం. వెంకన్న, డి.రాజేశ్వర్, బి.మల్లేష్, పి.రామకృష్ణ పాల్గొన్నారు.
రెడ్డి విద్యార్థులకు న్యాయం జరగాలి
నిజామాబాద్‌రూరల్, వెలుగు: విద్య, ఉద్యోగ రంగాల్లొ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు మరింత న్యాయం జరగాలని మొటాడిరెడ్డి కల్యాణ మండప అధ్యక్షుడు ఈగరమేశ్రెడ్డి అన్నారు. ఆదివారం సంఘం నూతన కమిటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ రెడ్డితోపాటు ఇతర ఓసీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కొత్త క్యాలెండర్లను ఆవిష్కరించారు. సమావేశంలో అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి సుధాకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సాయారెడ్డి, విక్రమ్‌రెడ్డి, నర్సారెడ్డి, హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు.