ఇబ్రహీంపట్నం లయోలా స్కూల్​ కరస్పాండెంట్​ అరెస్ట్​

ఇబ్రహీంపట్నం లయోలా స్కూల్​ కరస్పాండెంట్​ అరెస్ట్​

ఇబ్రహీంపట్నం, వెలుగు: టెన్త్​స్టూడెంట్ తో అసభ్యకరంగా ప్రవర్తించిన ఇబ్రహీంపట్నం లయోలా మోడల్ హైస్కూల్ కరస్పాండెంట్ దినవన్ రావును పోలీసులు శుక్రవారం అరెస్ట్​చేసి రిమాండుకు తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోక్సో, అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. 

విషయం తెలుసుకున్న ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ నేతలు, స్టూడెంట్లు శుక్రవారం ఉదయం ఇబ్రహీంపట్నం చౌరస్తాలో ధర్నా చేశారు. స్కూల్​లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురు విద్యార్థి నాయకులను అరెస్ట్​చేసి స్టేషన్​కు తరలించారు.