ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు 25% రాయితీని వినియోగించుకోవాలి: వికారాబాద్​ జిల్లా కలెక్టర్

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు 25% రాయితీని వినియోగించుకోవాలి: వికారాబాద్​ జిల్లా కలెక్టర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. మార్చి 31లోగా క్రమబద్ధీకరణ రుసుం చెల్లిస్తేనే ఈ రాయితీ వర్తిస్తుందని చెప్పారు. కలెక్టరేట్​హాల్​లో  మంగళవారం ఏపీవోలు, పంచాయతీ సెక్రటరీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ ప్లాట్​ రిజిస్ట్రేషన్ టైంలోనే ఫీజు చెల్లించి రెగ్యులరైజ్​ చేసుకోవచ్చన్నారు. అర్బన్, రూరల్, గ్రామ పంచాయతీల్లో రాయితీపై అవగాహన కల్పించాలన్నారు.

మున్సిపల్, కలెక్టరేట్​లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామన్నారు. క్రమబద్ధీకరించని భూముల్లో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతించేది లేదన్నారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లింగ్యా నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, మున్సిపల్​ కమిషనర్​లు జాకీర్ అహమ్మద్, బలరాం  నాయక్, వెంకటయ్య, విక్రం సింహా రెడ్డి ఉన్నారు.