మార్చి నెలాఖరు వరకు ఎల్ఆర్ఎస్​పై రాయితీ : హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్అహ్మద్

 మార్చి నెలాఖరు వరకు ఎల్ఆర్ఎస్​పై రాయితీ : హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్అహ్మద్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎల్ఆర్ఎస్ కింద రాయితీ పొందాలనుకునేవారు ఈ నెల31లోపు ఫీజు చెల్లించాలని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్అహ్మద్ సూచించారు. బీఆర్ కేఆర్ భవన్​లో బుధవారం లైసెన్సుడ్​టెక్నికల్ పర్సన్స్, ఆర్కిటెక్ట్ లతో హెచ్ఎండీఏ ఎల్ఆర్ఎస్–-2020 పై వర్క్ షాప్ నిర్వహించారు.

కమిషనర్​మాట్లాడుతూ నిషేధిత భూములు, చెరువులు, ఎఫ్ టీఎల్ నుంచి 200 మీటర్ల పరిధిలో లేని ప్లాట్లకి సంబంధించి ఎల్ఆర్ఎస్​దరఖాస్తుల కోసం, ప్రొవిజనల్ ఎల్ఆర్ఎస్ ఫీజు నోటీస్​ఆటోమేటిక్‌‌ గా జనరేట్ అవుతుందన్నారు. నెలాఖరులోపు చెల్లిస్తే 25 శాతం రాయితీ పొందవచ్చన్నారు. అప్లికేషన్ రిజెక్ట్ అయితే10 శాతం ప్రాసెసింగ్ చార్జీలు తీసుకొని మిగతా 90 శాతం రీఫండ్ చేస్తామన్నారు.

చెరువుల నుంచి 200 మీటర్ల పరిధిలో ఉన్న ప్లాట్ల ఎల్ఆర్ఎస్​ దరఖాస్తులు, రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రాసెస్ చేస్తామన్నారు. సందేహాలు ఉంటే హెచ్ఎండీఏ ఆఫీసులో ఉదయం 10  గంటల నుంచి సాయంత్రం 6 లోపు సంప్రదించాలన్నారు. 1800 599 8838 నెంబర్ కి కాల్​చేయవచ్చన్నారు. హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్లు, ప్లానింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు