నా ఇష్టమొచ్చినప్పుడు ఎగరేస్తా : ఎల్ఎస్ఏ జనార్దన్

నా ఇష్టమొచ్చినప్పుడు ఎగరేస్తా : ఎల్ఎస్ఏ జనార్దన్

గండీడ్, వెలుగు: మహబూబ్​నగర్​జిల్లాకు చెందిన ఓ ఎల్ఎస్ఏ(లైవ్​స్టాక్ వెటర్నరీ అసిస్టెంట్) జాతీయ జెండాను అవమానించేలా వ్యవహరించాడు. మద్యం మత్తులో జెండా వందనంలో పాల్గొన్నాడు. మహమ్మదాబాద్ మండలం నంచర్ల పశు ఆరోగ్య ఉప కేంద్రంలో పనిచేసే ఎల్ఎస్ఏ జనార్దన్ శుక్రవారం ఫుల్లుగా మద్యం తాగాడు. ఔట్​సోర్సింగ్​అటెండర్​ బామ్లా నాయక్ వచ్చి ఆఫీసులో జెండా వందనానికి ఏర్పాట్లు చేసినప్పటికీ, తాగి పడుకున్న జనార్దన్ లెగవలేదు.

పైగా తనకు ఇష్టమొచ్చినప్పటుడు జెండా ఎగరేస్తానంటూ బామ్లానాయక్​పై సీరియస్​అయ్యాడు. ఇదేం తీరని నిలదీసిన గ్రామస్తులతో వాగ్వాదానికి దిగాడు. చివరికి చేసేదేం లేక గ్రామస్తులు, చిన్నారులు, యువజన సంఘాల నేతలతో అటెండరే జెండాను ఎగరవేశాడు. ఎల్ఎస్ఏ జనార్దన్​డెయిలీ తాగి డ్యూటీకి వస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. నంచర్ల కేంద్రం పరిధిలో 13 జీపీలు ఉన్నాయి.