టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా లండన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా..తాజాగా రాహుల్ గాయం నుంచి కోలుకొని ఇండియాకు వచ్చేశాడు. దీంతో రాహుల్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రాహుల్ పూర్తి ఫిట్ నెస్ సాధించడం కోసం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉంటాడని.. నివేదికలు తెలిపాయి.
ఈ వికెట్ కీపర్ బ్యాటర్ త్వరలోనే లక్నో సూపర్ జయింట్స్ జట్టుతో కలిసే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నానని..ఈ సంవత్సరం తనకెంతో స్పెషల్ అంటూ.. హోమ్ గ్రౌండ్ లో అభిమానుల మధ్య ఆడటం చాలా గర్వంగా ఉంటుందని రాహుల్ అన్నాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్ నుంచి రాహుల్ అందుబాటులో ఉండనున్నారు. 2022, 2023 లో వరుసగా రెండు సీజన్ లలో ప్లే ఆఫ్ కు చేరిన జట్టుగా నిలిచింది. మార్చి 24న LSG రాజస్థాన్ రాయల్స్‌తో తొలి మ్యాచ్ తో ఈ లీగ్ ను ప్రారంభించనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.
రాహుల్ ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ తరపున కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. చివరి మూడు సీజన్ ల నుంచి ఐపీఎల్ లో అత్యంత నిలకడ చూపిస్తున్నాడు. ఈ సారి ఓపెనర్ గా కాకుండా మిడిల్ ఆర్డర్ లో ఆడే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ ఆడిన రాహుల్.. ఆ తర్వాత తొడకండరాలు పట్టేడయడంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. నాలుగో టెస్ట్ సమయానికి కోలుకున్నట్లుగా కనిపించినా.. గాయం తిరగ బెట్టడంతో అతన్ని బీసీసీఐ లండన్ కు పంపించింది.
Special message from the special one 💙🧿
— Lucknow Super Giants (@LucknowIPL) March 4, 2024
Pre-register for your tickets ▶️ https://t.co/PT6tyy7QUO pic.twitter.com/yCP84HWM5k