
బెంగళూరు: లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్‌న్యూస్. ఆ టీమ్ ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని బరిలోకి దిగేందుకు రెడీ అయ్యాడు. చాన్నాళ్లుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రిహాబిలిటేషన్‌లో ఉన్న మయాంక్ బౌలింగ్ చేయడానికి బీసీసీఐ మెడికల్ టీమ్, ఫిజియోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈనెల 19న జైపూర్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశముంది. గత సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ మయాంక్‌ను లక్నో రూ. 11 కోట్లతో రిటైన్ చేసుకుంది.