
టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించగానే స్క్వాడ్ లో సీనియర్ బ్యాటర్ రాహుల్ లేకపోవడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్ తో పాటు ఐపీఎల్ లో సూపర్ ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ కు అవకాశమిచ్చారు. దీంతో రాహుల్ కు నిరాశ తప్పలేదు. రాహుల్ అనుభవం కంటే కుర్రాళ్లపైనే సెలక్టర్లు నమ్మకముంచారు. ఇదే సమయంలో కేఎల్ రాహుల్ అభిమానులు రాహుల్ ను ఎంపిక చేయకపోవడంతో మండిపడుతున్నారు.
మరోవైపు రాహుల్ కెప్టెన్ గా ఉంటున్న లక్నో సూపర్ జయింట్స్ యాజమాన్యం ఈ వెటరన్ బ్యాటర్ కు మద్దతుగా నిలిచింది. తన అధికారిక ఎక్స్ ద్వారా లక్నోతో రాహుల్ ప్రయాణం ప్రారంభం కాకముందు నుంచి అతను నా నెంబర్ వన్ అతగాడంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. సుదీర్ఘ గాయం విరామం తర్వాత ఐపీఎల్‌లో ఆడిన కేఎల్ రాహుల్.. ఆరంభంలో నెమ్మదిగ ఆడటంపై మొదట్లో విమర్శలు వచ్చాయి.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో రాహుల్ 9 మ్యాచ్ ల్లో 378 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 144.27 గా ఉంది. మరోవైపు పంత్, సంజు శాంసన్.. రాహుల్ కంటే మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. శాంసన్ స్ట్రైక్ రేట్ 161.09 గా ఉంటే.. పంత్ స్ట్రైక్ రేట్ 158.57గా ఉంది. ఈ గణాంకాల ఆధారంగానే రాహుల్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న లక్నో టీం అదరగొడుతుంది. ఆడిన 10 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించి ప్లే ఆఫ్ కు దగ్గరలో ఉంది.
Our No.1 since Day Zero 💙 pic.twitter.com/g6em6OnVEu
— Lucknow Super Giants (@LucknowIPL) April 30, 2024