ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30కు ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు టీమ్‌లు ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా, 3 మ్యాచుల్లోనూ లక్నో గెలిచింది.
కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో లక్నో జట్టు ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడగా 3 గెలిచి పాయింట్ల పట్టికలలో మూడో స్థానంలో ఉండగా, ఐదు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే సాధించి పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ ఫామ్ లో ఉంది. హ్యాట్రిక్ విజయాలను సాధించిన ఉత్సహంతో ఢిల్లీతో జరిగే మ్యాచ్ కు బరిలో దిగుతుంది. అయితే ఈ మ్యాచ్ కు ఆ జట్టు సంచలన పేసర్ మయాంక్ యాదవ్ గాయం కారణంగా ఇవాళ్టి మ్యాచ్ కు దూరం కానున్నాడు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ఓకే ఒక ఓవర్ వేసి తుంటి గాయంతో మైదానాన్ని వీడాడు. లక్నో టీమ్ కు విరుద్దంగా ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి ఉంది. వరుస ఓటములు ఆ జట్టును కలవర పెడుతున్నాయి. ఈ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ , పృథ్వీ షాలు పుంజుకుంటే ఆ జట్టు గెలవడం పెద్ద విషయం కాదు.
లక్నోలోని ఎకానా స్టేడియం బ్యాటర్.. బౌలర్లకు సమానంగా అనుకూలిస్తోంది. పంజాబ్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో లక్నో తొలుత 199 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో లక్నోను గుజరాత్ టైటాన్స్ 163 పరుగులకే పరిమితం చేసింది. దీనిని బట్టి పిచ్ బ్యాటర్లకు, బౌలర్లకు అనుకూలిస్తుందని మాజీలు అంచనా వేస్తున్నారు.
లక్నో (అంచనా): క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్ / కెప్టెన్ ), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్/అర్షద్ ఖాన్, సిద్ధార్థ్
ఢిల్లీ (అంచనా) : డేవిడ్ వార్నర్, పృథ్వీ షా , అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్ / కెప్టెన్ ), జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ట్రిస్టన్ స్టబ్స్, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ , అన్రిచ్ నోర్ట్జే/లిజాద్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్