ఐపీఎల్ 2024లో భాగంగా నేడు(ఏప్రిల్ 12) లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సారథి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో లక్నో ఒకే మార్పుతో బరిలోకి దిగుతుండగా.. ఢిల్లీ పలు మార్పులు చేపట్టింది. బౌలింగ్‌లో వరుసగా విఫలమవుతోన్న అన్రిచ్ నొర్జీ స్థానంలో యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ జట్టులోకి వచ్చాడు.
అట్టడుగున ఢిల్లీ.. మూడో స్థానంలో లక్నో
ప్రస్తుతానికి ఢిల్లీ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండగా.. లక్నో మూడో స్థానంలో ఉంది. పంత్ సేన ఇప్పటివరకూ ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒకే ఒక దానిలో విజయం సాధించింది. స్టార్ ఆటగాళ్లున్నా,.. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమవుతోంది. మరోవైపు, రాహుల్ సారథ్యంలోని లక్నో పర్వాలేదనిపిస్తోంది. ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో టాప్ 3లో దూసుకెళ్తోంది.
తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్/ వికెట్ కీపర్), క్వింటన్ డి కాక్, దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, అర్షద్ ఖాన్, యశ్ ఠాకూర్, నవీన్ ఉల్ హక్.
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, షాయ్ హోప్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.