LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. గెలిస్తే కోల్‌కతా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం!

LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. గెలిస్తే కోల్‌కతా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం!

ఆదివారం(మే 05) పూట మంచి మజా ఆస్వాదిద్దామనుకున్న అభిమానులకు తొలి మ్యాచ్ అంత కిక్ ఇవ్వలేదు. చేసింది 167 పరుగులకే అయినా.. చెన్నై బౌలర్లు దానిని కాపాడడంలో పైచేయి సాధించారు. ఫలితంగా పంజాబ్‌ను 28 పరుగుల తేడాతో మట్టి కరిపించి.. విలువైన 2 పాయింట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. 

ఇప్పుడు రెండో మ్యాచ్‌కు వచ్చేశాం.. కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  కోల్‌క‌తా ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. ల‌క్నో ఒక మార్పు చేసింది. గాయ‌ప‌డిన మ‌యాంక్ యాద‌వ్ స్థానంలో య‌శ్ ఠాకూర్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. రెండు బలమైన జట్ల మధ్య మ్యాచ్ కావున హోరాహోరీ పోరు ఆశించవచ్చు. ఇప్పటివరకూ ఆడిన 10 మ్యాచ్‪ల్లో 7 విజయాలు సాధించిన కోల్‌కతా 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో వారు విజయం సాధిస్తే  ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకోవచ్చు. నెట్ రన్‌రేట్(+1.098) వారికి అదనపు బలం. 

తుది జట్లు

లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్/ వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్. 

కోల్‌కతా: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.