ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ విజేత ముంబై ఇండియన్స్ మరో సమరానికి సిద్ధమైంది. మంగళవారం(ఏప్రిల్ 30) ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన లక్నో సారథి కెఎల్ రాహుల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో.. భారీ స్కోరు చేసి సరైన లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచగలమన్న ధీమా వ్యక్తం చేశాడు.. రాహుల్.
ఈ మ్యాచ్ ముంబైకి చావో రేవో వంటింది. ఓడితే ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టం అవుతాయి. ఇప్పటివరకూ 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై.. మూడింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే.. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి తీరాలి. మరోవైపు, లక్నో పరిస్థితి కాస్త పర్వాలేదు. ఇప్పటివరకూ 9 మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది.
తుది జట్లు
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా.
లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్ (కెప్టెన్/ వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్.
🚨 Toss Update 🚨
— IndianPremierLeague (@IPL) April 30, 2024
Lucknow Super Giants elect to bowl against Mumbai Indians.
Follow the Match ▶️ https://t.co/I8Ttppv2pO#TATAIPL | #LSGvMI pic.twitter.com/Xy0DcL6by1