తప్ప గెలవాల్సిన మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్ బ్యాటర్లు తడబడుతున్నారు. ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై 27 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. సొంతగడ్డపై లక్నో పేసర్లు విజృంభిస్తుండడంతో వరుస ఓవరల్లో వికెట్లు పడుతున్నాయి.
రెండో ఓవర్ మూడో బంతికి మొహ్సిన్ ఖాన్.. రోహిత్ శర్మ(4)ను ఔట్ చేయగా, ఆ మరుసటి ఓవర్‌లో రాహుల్ స్టన్నింగ్ క్యాచ్‌తో సూర్యకుమార్ యాదవ్(10)ను వెనక్కి పంపాడు. ఆపై కొద్దిసేపటికే నవీన్-ఉల్-హక్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి తిలక్ వర్మ(7) రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆ మరుసటి బంతికే హార్దిక్ పాండ్యా(0) ఔటయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దాంతో, 27 పరుగులకే ముంబై 4 వికెట్లు పడ్డాయి. ప్రస్తుతం ఇషాన్ కిషన్(6), నెహాల్ వధేరా(5) ఆచితూచి ఆడుతున్నారు. 7 ఓవర్లు ముగిసేసరికి స్కోర్..36/4.
Mumbai Indians are in a deep trouble! Lost four big wickets inside the powerplay.
— CricTracker (@Cricketracker) April 30, 2024
Hardik Pandya is the latest man to walk back.
📸: Jio Cinema pic.twitter.com/5TcReIms9L