ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం(మార్చి 30) లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో లక్నో యాజమాన్యం కొత్త స్ట్రాటజీ మొదలుపెట్టింది. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను కాదని నికోలస్ పూరన్ వైపు మొగ్గు చూపింది. దీంతో రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. టాస్ గెలిచిన లక్నో సారథి నికోలస్ పూరన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఇప్పటివరకూ పంజాబ్ కింగ్స్ ఆడిన రెండింటిలో ఒకదానిలో విజయం సాధించగా.. లక్నో ఆడిన ఒక మ్యాచ్ లో పరాజయం పాలైంది.
KL Rahul playing as an impact player tonight. pic.twitter.com/zLW5j1AaaQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 30, 2024
తుది జట్లు
లక్నో: నికోలస్ పూరన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్.
పంజాబ్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.