LSG vs PBKS: లక్నోను చిత్తు చేసిన ఆ ముగ్గురు.. పంజాబ్ కింగ్స్ ముందు చిన్నదైన లక్ష్యం..!

LSG vs PBKS: లక్నోను చిత్తు చేసిన ఆ ముగ్గురు.. పంజాబ్ కింగ్స్ ముందు చిన్నదైన లక్ష్యం..!
  • లక్నోపై పంజా  .. 8 వికెట్లతో పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌‌‌‌‌‌‌ విజయం
  • రాణించిన ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రన్‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌, అర్ష్​దీప్‌‌‌‌

లక్నో: బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో దుమ్మురేపిన పంజాబ్‌‌‌‌‌‌‌‌ కింగ్స్‌‌‌‌‌‌‌‌.. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌–18లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (34 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 9 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 69), కెప్టెన్‌‌‌‌‌‌‌‌ శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ (30 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 52 నాటౌట్‌‌‌‌‌‌‌‌), నేహల్‌‌‌‌‌‌‌‌ వాధెర (25 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 43 నాటౌట్‌‌‌‌‌‌‌‌) దంచికొట్టడంతో మంగళవారం (April 1) జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌‌‌‌‌‌‌‌ జెయింట్స్‌‌‌‌‌‌‌‌పై ఘన విజయం సాధించింది. 

టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన లక్నో 20 ఓవర్లలో 171/7 స్కోరు చేసింది. నికోలస్‌‌‌‌‌‌‌‌ పూరన్‌‌‌‌‌‌‌‌ (30 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 44), ఆయుష్‌‌‌‌‌‌‌‌ బదోనీ (33 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌, 3 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 41), అబ్దుల్‌‌‌‌‌‌‌‌ సమద్‌‌‌‌‌‌‌‌ (12 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 27) రాణించారు. తర్వాత పంజాబ్‌‌‌‌‌‌‌‌ 16.2 ఓవర్లలోనే 177/2 స్కోరు చేసి నెగ్గింది. ప్రభ్‌‌‌‌సిమ్రన్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. 

తడబడి.. తేరుకుని

ముందుగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన లక్నో ఆరంభంలో తడబడినా కీలక టైమ్‌‌‌‌‌‌‌‌లో తేరుకుంది. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ నాలుగో బాల్‌‌‌‌‌‌‌‌కే మిచెల్‌‌‌‌‌‌‌‌ మార్ష్‌‌‌‌‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ (3/43) షాకిచ్చాడు. మూడో ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌ నుంచి బయటపడ్డ మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ (28) తర్వాత వరుస బౌండ్రీలు కొట్టాడు.  నాలుగో ఓవర్‌‌‌‌‌‌‌‌లో 4, 6తో జోరు పెంచాడు. రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 31 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేసి ఫెర్గూసన్‌‌‌‌‌‌‌‌ (1/26)కు వికెట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చుకున్నాడు. తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌ (2) ఫైన్‌‌‌‌‌‌‌‌ లెగ్‌‌‌‌‌‌‌‌లో క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి డకౌటయ్యాడు. ఫలితంగా ఏడు బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో రెండు కీలక వికెట్లు పడటంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో లక్నో 39/3 స్కోరుకే పరిమితమైంది. 

ఈ దశలో పూరన్‌‌‌‌‌‌‌‌ రెండు ఫోర్లతో, ఆయుష్‌‌‌‌‌‌‌‌ బదోనీ సిక్స్‌‌‌‌‌‌‌‌తో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను గాడిలో పెట్టారు. చహల్‌‌‌‌‌‌‌‌ (1/4) వేసిన10వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో పూరన్‌‌‌‌‌‌‌‌ 4, 4, 6 దంచడంతో స్కోరు 76/3కి పెరిగింది. 11వ ఓవర్‌‌‌‌‌‌‌‌లోనూ 6, 4 కొట్టిన పూరన్‌‌‌‌‌‌‌‌ను 12వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో చహల్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. దీంతో నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 54 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. డేవిడ్‌‌‌‌‌‌‌‌ మిల్లర్‌‌‌‌‌‌‌‌ (19) చకచకా బౌండ్రీలు కొట్టినా వికెట్‌‌‌‌‌‌‌‌ కాపాడుకోలేదు. ఇక సిక్సర్‌‌‌‌‌‌‌‌తో ఖాతా తెరిచిన అబ్దుల్‌‌‌‌‌‌‌‌ సమద్‌‌‌‌‌‌‌‌తో కలిసి బదోనీ పవర్‌‌‌‌‌‌‌‌ హిట్టింగ్‌‌‌‌‌‌‌‌కు దిగాడు. 18వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో ఈ ఇద్దరు కలిసి 4, 6, 4, 4తో 20 రన్స్‌‌‌‌‌‌‌‌ దంచారు. అయితే లాస్ట్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో ఇద్దరూ ఔటయ్యారు.

ముగ్గురే కొట్టేసిండ్రు..

టార్గెట్‌‌‌‌ లక్ష్యాన్ని పంజాబ్‌‌‌‌‌‌‌‌ ముగ్గురు బ్యాటర్లే ఊదేశారు. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రన్‌‌‌‌‌‌‌‌ అదిరిపోయే ఆరంభాన్నిస్తే చివర్లో శ్రేయస్‌‌‌‌‌‌‌‌, నేహల్‌‌‌‌‌‌‌‌ వాధెర సూపర్‌‌‌‌‌‌‌‌ ఫినిషింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. తొలి ఓవర్‌‌‌‌‌‌‌‌లో 4, 6తో ఖాతా తెరిచిన ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రన్‌‌‌‌‌‌‌‌ 10వ ఓవర్ల పాటు లక్నో బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను దీటుగా ఎదుర్కొన్నాడు. మూడో ఓవర్‌‌‌‌‌‌‌‌లో ప్రియాన్షు ఆర్య (8) వెనుదిరిగినా తను మాత్రం ఎక్కడా తగ్గలేదు. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ అండగా నిలిచాడు. 

ఆరో ఓవర్‌‌‌‌‌‌‌‌లో ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రన్‌‌‌‌‌‌‌‌ 4, 4, 6 దంచడంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో పంజాబ్‌‌‌‌‌‌‌‌ 62/1 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌లో ఫోర్‌‌‌‌‌‌‌‌ కొట్టిన ప్రభ్‌‌‌‌ 29 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ అందుకున్నాడు. ఇదే ఓవర్‌‌‌‌‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌‌‌‌‌ కొడితే.. 8, 9వ ఓవర్లలో ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రన్‌‌‌‌‌‌‌‌ మూడు ఫోర్లతో రెచ్చిపోయాడు. దాంతో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెన్‌‌‌‌‌‌‌‌లో పంజాబ్ 110/1 స్కోరుతో నిలిచింది. కానీ 11వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో దిగ్వేష్‌‌‌‌‌‌‌‌ రాఠీ (2/30) వేసిన తొలి బాల్‌‌‌‌‌‌‌‌ను భారీ షాట్‌‌‌‌‌‌‌‌గా మలిచే క్రమంలో బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌కి చిక్కాడు. 

రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 84 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. నేహల్‌‌‌‌‌‌‌‌ వాధెర ఫోర్‌‌‌‌‌‌‌‌తో ఆట మొదలుపెట్టాడు. శ్రేయస్‌‌‌‌‌‌‌‌తో పోటీపడి స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రొటేట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 14వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో 6, 4, 6 కొట్టిన వాధెర 16వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో రిపీట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. మధ్యలో 15వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌‌‌‌‌ 4, 6తో కొట్టాడు. మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 67 రన్స్‌‌‌‌‌‌‌‌ జతకావడంతో పంజాబ్‌‌‌‌ఈజీ  గెలిచింది. 

సంక్షిప్త స్కోర్లు

లక్నో: 20 ఓవర్లలో 171/7 (పూరన్‌‌‌‌‌‌‌‌ 44, ఆయూష్‌‌‌‌‌‌‌‌ 41, సమద్‌‌‌‌‌‌‌‌ 27, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ 3/43). 

పంజాబ్‌‌‌‌‌‌‌‌: 16.2 ఓవర్లలో 177/2 (ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రన్‌‌‌‌‌‌‌‌ 69, శ్రేయస్‌‌‌‌‌‌‌‌ 52*, నేహల్‌‌‌‌‌‌‌‌ 43*, 
దిగ్వేష్‌‌‌‌‌‌‌‌ రాఠీ 2/30).