ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కు ముందు లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు యువ ప్లేయర్లు మయాంక్ యాదవ్, నితీష్ రెడ్డి భారత్ తరపున అరంగేట్రం చేశారు. ఆదివారం (అక్టోబర్ 6) గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ప్లేయింగ్ లో వీరికి చోటు దక్కింది. దీంతో వారు ఈ ఇద్దరిని అన్క్యాప్డ్ ప్లేయర్లుగా రిటైన్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. 2025 మెగా ఆక్షన్ కు ముందు ప్రకటించిన రూల్స్ ప్రకారం అక్టోబర్ 31 లోపు అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడు క్యాప్డ్ ప్లేయర్గా పరిగణించబడతాడు.
లక్నో సూపర్ జెయింట్స్ కు మయాంక్ యాదవ్ ఆడుతున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్టార్ ఆటగాళ్లు సైతం ఈ యువ బౌలర్ ను ఆడలేక చేతులెత్తేశారు. దీంతో ఈ సారి అతన్ని అన్క్యాప్డ్ ప్లేయర్ గా తీసుకోవాలని లక్నో భావించింది. అన్క్యాప్డ్ ప్లేయర్ గా తీసుకుంటే వారికి రూ. 4 కోట్లు ఇచ్చినా సరిపోతుంది. ఇప్పుడు అవకాశం లేకపోవడంతో మయాంక్ ను రిటైన్ చేసుకోవాలంటే కనీసం రూ. 11 కోట్ల రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువగా చెల్లించాల్సిందే.
మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ నితీష్ కుమార్ రెడ్డిది ఇదే పరిస్థితి. ఈ యువ ప్లేయర్ 2024 ఐపీఎల్ సీజన్ లో ఆల్ రౌండర్ గా సత్తా చాటాడు. దీంతో సన్ రైజర్స్ అతన్ని అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరిలో తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. నితీష్ కూడా అంతర్జాతీయ అరంగేట్రం చేయడంతో సన్ రైజర్స్ కు నిరాశ తప్పలేదు. దీంతో ఈ యువ ఆల్ రౌండర్ ను రిటైన్ చేసుకోవాలంటే కనీసం రూ. 11 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువగా చెల్లించాల్సిందే. మయాంక్ తన తొలి మ్యాచ్ లో నాలుగుకు ఓవర్లలో 21 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. మరోవైపు నితీష్ 16 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
Nitish Kumar Reddy & Mayank Yadav pic.twitter.com/TANfRUwYj4
— RVCJ Media (@RVCJ_FB) October 6, 2024