
హైదరాబాద్, వెలుగు: ఎల్ అండ్ టీ ఫైనాన్స్ గత డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్ ఫలితాలను విడుదల చేసింది. ఈ క్వార్టర్లో రూ.626 కోట్ల నికరలాభం వచ్చింది. ఏడాది క్రితం డిసెంబరు క్వార్టర్లో వచ్చిన లాభం రూ.640 కోట్లతో పోలిస్తే ఇది 2.1 శాతం తగ్గింది. నికరవడ్డీ ఆదాయం రూ.1,833 కోట్ల నుంచి రూ.2,041 కోట్లకు పెరిగింది. గ్రాస్ ఎన్పీఏలు 3.19 శాతం నుంచి 3.23 శాతానికి, నెట్ఎన్పీఏలు రూ.0.96 శాతం నుంచి 0.97 శాతానికి పెరిగాయి.