ఖలిస్తానీ నిధులపై కేజ్రీవాల్ ను విచారించండి:ఎన్ఐఏకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్

ఖలిస్తానీ నిధులపై కేజ్రీవాల్ ను విచారించండి:ఎన్ఐఏకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్

న్యూఢిల్లీ: ఖలిస్తానీ నిధులపై అరవింద్ కేజ్రీవాల్ పై విచారణ చేపట్టాలని ఎన్ ఐఏకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు చేశారు. అమెరికాకు చెందని నిషేధిత ఖలిస్తానీ గ్రూప్ అయిన సిఖ్స్ ఫర్ జస్టిస్ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేేజ్రీవాల్ కు ముడుపులు అందాయని ఆరోపించారు. టెర్రరిస్టు దేవేంద్ర పాల్ భుల్లర్ ను విడుదల చేసేందుకు  ఆప్ పార్టీకి 16 మిలియన్ల డాలర్లు అందాయని అన్నారు. అయితే ఆప్ నేత ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.ఇది కేజ్రీవాల్ పై మరో కుట్ర అని విమర్శించారు.   

టెర్రరిస్ట్ దేవేంద్రపాల్ భుల్లార్ 1993లో ఢిల్లీ పేలుళ్ల కేసులో దోషి. భుల్లార్ ను విడుదల చేసేందుకు, ఖలిస్తానీ వాదాన్ని ప్రోత్సహించేందుకు ఆప్ ఖలిస్తానీ అనుకూల గ్రూపుల నుంచి 16 మిలియన్ డాలర్లు తీసుకున్నారని ఫిర్యాదు అందిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్  కార్యదర్శి  తెలిపారు. ఫిర్యాదుదారు సమర్పించిన ఎలక్ట్రానిక్ సాక్ష్యం ఫోరెన్సిక్ పరీక్షతో సహా దర్యాప్తు అవసరం అని సక్సెనా అన్నారు. 

2014 , 2022 మధ్య AAP ఖలిస్తానీ గ్రూపుల నుంచి USD 16 మిలియన్లు పొందిందని సిక్కుల కోసం జస్టిస్ చీఫ్ వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ విడుదల చేసిన వీడియో ఎవిడెన్స్ ఉందన్నారు. దీంతోపాటు 2014లో కేజ్రీవాల్ న్యూయార్క్ లోని గురుద్వారా రిచ్ మండ్ హిల్స్ లో ఖలిస్తానీ నేతలతో క్లోజ్డ్ డోర్ సమావేశాలు నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయన్నారు. కేజ్రీవాల్ కు ముడుపులు ముట్టినందుకే భుల్లార్ విడుదలకు కేజ్రీవాల్ హామీ ఇచ్చారని ఫిర్యాదుదారు ఆరోపణలో పేర్కొన్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తెలిపింది. 

ఖలిస్తానీ నిధుల ఆరోపణలను ఖండించిన ఆప్

దేశ రాజధానిలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ రాజకీయ కుట్ర చేస్తోందని ఆప్ పార్టీ నేత భరద్వాజ్ ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ సార్ బీజేపీ ఏజెంట్.. మే 25న ఢిల్లీలో పోలింగ్ జరగనున్న సమయంలో బీజేపీ ఆదేశానుసారం అరవింద్ కేజ్రీవాల్ పై ఇది మరో పెద్ద కుట్ర అని అన్నారు. ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాల్లో ఓటమి భయంతోనే బీజేేపీ తీవ్ర భయాందోళనకు గురవుతోందన్నారు.  2022లో కూడా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేేపీ ఇలాంటి కుట్రలే చేసిందని ఆప్ నేత భరద్వాజ్ అన్నారు.