మెట్రో స్టేషన్ల వద్ద పెయిడ్​ పార్కింగ్​ ఉన్నట్టా? లేనట్టా?

మెట్రో స్టేషన్ల వద్ద పెయిడ్​ పార్కింగ్​ ఉన్నట్టా? లేనట్టా?

హైదరాబాద్ సిటీ, వెలుగు: మెట్రో రైలు ప్రయాణికులతో ఎల్అండ్​టీ దోబూచులాడుతోంది. నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద సెప్టెంబర్ 15 నుంచి పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తున్నట్లు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించింది.

 ఇప్పటికే రెండుసార్లు బోర్టులు ఏర్పాటు చేసి తొలగించగా, మళ్లీ ఇలా చేయడం వరుసగా మూడోసారి. గతంలో ఆగస్టు 25 నుంచి నాగోల్ స్టేషన్​లో, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ స్టేషన్​లో పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తున్నట్లు ఎల్అండ్ టీ ప్రకటించింది. 

ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రావడంతో  నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఆ తర్వాత సెప్టెంబర్ ఒకటి నుంచి అంటూ బోర్డు పెట్టి, వారం గడవక ముందే యూటర్న్ తీసుకుంది. తాజాగా సెప్టెంబర్ 15 నుంచి పెయిడ్ పార్కింగ్ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆగస్టు 30న బోర్డు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం మళ్లీ ఆ బోర్డులను తొలగించింది.