తమిళ్ ప్రముఖ హీరోయిన్ శ్వాసికా విజయ్ గత ఏడాది జనవరి 26న తన చిరకాల ప్రేమికుడు ప్రేమ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరూ అన్య ప్రాంతాలు, మతాలకి సంబంధించినవారు కావడంతో ఇరువురి సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు.
అయితే ప్రేమ్ కుటుంబం కేరళలో సెటిల్ అయ్యారు. అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడంతో మొదటిసారి కేరళ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు తమిళ్ సాంప్రదాయ పద్దతిలో ఈరోజు మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా శ్వాసికా విజయ్ తన అభిమానులతో పంచుకుంది. అలాగే పెళ్ళికి సంబందించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. దీంతో కొందరు అభిమానులు వెడ్డింగ్ యానివర్సరీతోపాటు పెళ్లి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి శ్వాసికా విజయ్ తమిళ్ ప్రముఖ డైరెక్టర్ తమిజరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించిన లబ్బర్ పందు అనే సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అంతేగాకుండా నటి శ్వాసికా విజయ్ కి ఈ సినిమా కెరీర్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం శ్వాసికా విజయ్ కి తెలుగు, తమిళ్, మలయాళం తదితర సినిమా ఇండస్ట్రీలనుంచి సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.