Viral Video: అదృష్టమంటే ఈ అక్కదే..రైలు కిందపడినా బతికింది

Viral Video: అదృష్టమంటే ఈ అక్కదే..రైలు కిందపడినా బతికింది
  • ఆమె ఆలోచనకు అందరూ హ్యాట్సాఫ్
  • వికారాబాద్ జిల్లా   తాండూరులో సంఘటన

ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలలో ఎందరో ప్రాణాలు కోల్పోతారు. కొందరు మాత్రమే అదృష్ట వశాత్తు బతికిపోతారు. అనుకోకుండా జరిగే రైలు ప్రమాదాల్లో బతికి బయటపడం అసాధ్యమే. కాని వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం నావంద్గి రైల్వే స్టేషన్‌ పరిధిలో ఓ గిరిజన మహిళ అదృష్ణ వశాత్తు బతికి పోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. పూర్తి వివరాల్లోకి వెళితే.

వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌ మండలం నవాంద్గి రైల్వేస్టేషన్‌ మధ్య ఈ సంఘటన జరిగింది. రైల్వేస్టేషన్ సమీపంలో టాకీ తాండాకు చెందిన ఓ మహిళ పట్టాలు తాటే ప్రయత్నం చేస్తుండగా..వేగంగా దూసుకొచ్చింది ఓ గ్రూడ్స్ రైలు..ఆ మహిళ వెంటనే రైలు పట్టాల మధ్య పడుకుంది. ఏమాత్రం తలనుగానీ శరీరాన్ని పైకిలేప కుం డా పట్టాలకు అతుక్కుపోయింది. ఊపిరి బిగబట్టి.. స్థానికుల సూచనలు పాటిస్తూ ధైర్యంగా పడుకుంది. రైలు పూర్తిగా వేళ్లేంత వరకు అలాగే పడుకుంది.

ALSO READ | లారీ బీభత్సం..తల్లీకూతురు మృతి..తండ్రీబిడ్డకు తీవ్రగాయాలు

రైలు వెళ్లిపోయిన తరువాత ప్రాణాలతో సేఫ్‌గా బయటపడింది. బతుకు జీవుడా అంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది.. ఈ సంఘటనను స్థానికులు  వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్  చేయడంతో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. ఎవరైనా రైలు పట్టాలు దాటేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు.