బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో నిందితులందరికీ లక్నో సీబీఐ స్పెషల్ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. మసీద్ పై దాడి ప్లాన్ ప్రకారం జరగలేదని కోర్టు వెల్లడించింది. కుట్ర ప్రకారమే దాడి జరిగిందనడానికి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. బాబ్రీ తీర్పు వెలువడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.
డిసెంబర్ 6, 1992లో అయోధ్యలోని బాబ్రీ మసీదును కొంతమంది నిరసనకారులు కూల్చివేశారు. ఈ దాడికి సంబంధించి సీబీఐ 1993లో 49 మందిపై చార్జీషీట్ నమోదు చేసింది. అప్పటి నుంచి అంటే గత 28 సంవత్సరాలుగా ఈ కేసు మీద విచారణ కోనసాగుతూనే ఉంది. బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ఆధ్వర్యంలో అయోధ్యలో రథయాత్ర సాగుతుండగా.. వేలమంది హిందువులు మసీదు మీద దాడి చేసి కూల్చివేశారు. అప్పడు కళ్యాణ్ సింగ్ యూపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మసీదు కూల్చివేత వల్ల చెలరేగిన అల్లర్లలో దాదాపు 3000 మంది వరకు మరణించారు.
ఈ కేసులో ఎల్‌కే అధ్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, కళ్యాణ్ సింగ్ మొదలైన 48 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వారిలో కేసు విచారణలో ఉండగానే 16 మంది చనిపోగా.. మిగతా 32 మందికి క్లీన్‌చిట్ ఇస్తూ సీబీఐ స్పెషల్ జడ్జ్ సురేంద్రకుమార్ తీర్పు చెప్పారు. వీరందరూ మసీద్ కూల్చివేతను అడ్డుకోవడానికి ప్రయత్నించారని కోర్టు చెప్పింది. ఈ కేసుకు సంబంధించి దాదాపు 2 వేల పేజీలతో తీర్పును సిద్ధం చేశారు. అభియోగాలు ఎదుర్కొన్న 32 మందిలో 26 మంది మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. మిగతా ఆరుగురు కళ్యాణ్ సింగ్, సతీష్ ప్రధాన్, మహంత్ నృత్య గోపాల్‌దాస్, ఉమాభారతి, జోషి, అధ్వానీలు వీడియో కాన్ఫరెన్స్ కోర్టుకు హాజరయ్యారు. సీబీఐ అధికారులు ఈ కేసులో 351 మంది సాక్షుల్ని విచారించారు.
For More News..